BigTV English

Congress Rejects Ayodhya | ‘అయోధ్య ఓ బీజేపీ పొలిటికల్ ఈవెంట్’.. రామమందిర ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్

Congress Rejects Ayodhya | మరి కొన్ని రోజుల్లో జరుగబోయే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించింది. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి జయరామ్ రమేష్ బుధవారం ఈ ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత అధీర్ రంజన్ కూడా అయోధ్య కార్యక్రమానికి వెళ్లడం లేదని జయరామ్ రమేష్ తెలిపారు.

వారం రోజుల క్రితమే మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ ఆహ్వానం అందినట్లు తెలిసంది. జయరామ్ రమేష్ మాట్లాడుతూ.. భారతదేశంలో కోట్ల మంది భారతీయులు శ్రీ రాముడిని భక్తితో పూజిస్తారు. మతం ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయం. కానీ బిజేపీ, RSS కొన్ని సంవత్సరాలుగా అయోధ్య రామ మందిర్ అంశాన్ని రాజకీయం చేసింది. చాలా స్పష్టంగా కనిపిస్తోంది.. కేవలం లోక్ సభ ఎన్నికలలో ఓట్లు పొందడానికే రామ మందిర ప్రారంభోత్సం చేపట్టారు. శ్రీ రామ భగవానుడిని పూజించే కోట్ల మంది హిందువుల భావనలను గౌరవిస్తున్నాం. 2019లో సుప్రీం కోర్టు ఇచ్చిన అయోధ్య తీర్పును గౌరవిస్తున్నాం. కానీ అయోధ్య ఇప్పుడు బిజేపీ, RSS పొలిటికల్ ఈవెంట్ (రాజకీయ కార్యక్రమం) అందుకే ఈ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాం.

జనవరి 22న అయోధ్యలో రామ మందిరంలోని రామ్ లలా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం భవ్యంగా జరుగనుంది. ఈ రోజు దేశ నలుమూలల నుంచి రాజకీయ నాయకులు, సినిమా సెలెబ్రిటీలు, ఆధ్యాత్మిక గురువులు, పలువురు శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం కోసం అయోధ్య నగరంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 23 నుంచి అయోధ్య శ్రీ రాముడి దర్శన భాగ్యం సామాన్య ప్రజలకు లభిస్తుంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×