BigTV English

Traffic E-Challan : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్‌ చలానాల రాయితీ గడువు పొడిగింపు..

Traffic E-Challan : వాహనదారులకు రవాణాశాఖ మరో ఛాన్స్‌ ఇచ్చింది. పెండింగ్‌ చలానాల చెల్లింపునకు గడువు తేదీని ఈ నెల 31 వరకు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలానాలు ఉన్నాయని రవాణా శాఖ వెల్లడించింది. డిసెంబరు 25 వరకు ఉన్న వాటిపై భారీగా రాయితీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

Traffic E-Challan : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్‌ చలానాల రాయితీ గడువు పొడిగింపు..

Traffic E-Challan : వాహనదారులకు తెలంగాణ రవాణాశాఖ మరో ఛాన్స్‌ ఇచ్చింది. పెండింగ్‌ చలానాల చెల్లింపునకు గడువు తేదీని జనవరి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలానాలు ఉన్నాయని రవాణాశాఖ వెల్లడించింది. డిసెంబరు 25 వరకు ఉన్న వాటిపై భారీగా రాయితీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.


ఆటోలకు 80%, ద్విచక్రవాహనాలు, ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాలకు 60% రాయితీ ప్రకటించటంతో రవాణా శాఖకు మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 1.05 కోట్ల చలానాలు చెల్లించినట్లు రవాణా శాఖ వెల్లడించింది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.107 కోట్ల ఆదాయం సమకూరినట్లు అయ్యింది.

సాంకేతిక సమస్యల వల్ల చెల్లింపులు ఆలస్యమవుతున్నట్లు వాహనదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని రవాణా శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాయితీ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు కోరారు.


సైబర్‌ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్‌తో వాహనదారులను బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. చలానాల చెల్లింపులో ఎలాంటి సందేహం ఎదురైనా 040-27852721, 8712661690 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్‌, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారానూ చెల్లింపులు స్వీకరిస్తున్నట్లు వివరించారు.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×