Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. బిభవ్ కుమార్ అరెస్టును వ్యతిరేకిస్తూ పార్టీ కార్యకర్తలతో నిరసన చేపట్టారు. పోలీసులు 144 సెక్షన్ విధించినా లెక్కచేయలేదు. తమను అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఆప్ నేతలను అరెస్ట్ చేయాడానికి మోదీ భయపడుతున్నారని వారు విమర్శించారు.
కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలను పోలీసులను అడ్డుకోవడంతో.. బీజేపీ ఆఫీస్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఆప్ నేతలు తిరిగి తమ కార్యాలయానికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో మాట్లాడిన కేజ్రీవాల్.. బీజేపీ, ప్రధాని మోదీలపై ధ్వజమెత్తారు. ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు ఆపరేషన్ ఝాడు కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు.
ఆప్ ను అంతం చేయడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రధాని మోదీ ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలని అనుకుంటున్నారని తెలిపారు. అందుకే ఆప్ నేతలను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ బ్యాంకు ఖాతాలను కూడా నిలిపివేయాలని చూస్తున్నారని వెల్లడించారు.
తను బెయిల్ వచ్చిన నాటి నుంచి మోదీ ఆప్ పై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. దేశానికి మంచి పనులు చేస్తోంది ఆప్ అని ఆయన అన్నారు. ఆప్ చేస్తున్న మంచి పనుల గురించి దేశమంతా చర్చింకుంటున్నారని చెప్పారు. ఆప్ కు బీజేపీ నుంచి ముప్పు ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు.
Also Read: బీజేపీ కుట్రలో భాగమే బిభవ్ అరెస్ట్.. జైల్ భరోకు పిలుపునిచ్చిన కేజ్రీవాల్
తమ పార్టీ నేతలను బీజేపీ టార్గెట్ చేయడాన్ని తప్పుబట్టిన కేజ్రీవాల్ ఆదివారం తన పార్టీ నేతలతో బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తానని.. కావాలంటే అందరినీ ఒకే సారి అరెస్ట్ చేయాలని బీజేపీకి సవాల్ విసిరారు. ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసులో బిభవ్ అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.
#WATCH | Aam Aadmi Party (AAP) leaders and workers hold a protest against the BJP, in Delhi
Delhi CM and AAP national convener Arvind Kejriwal is also present. pic.twitter.com/ZRqCWOBBO4
— ANI (@ANI) May 19, 2024