
G20 summit latest news(National news today India) :
జీ 20 డిన్నర్ ఇన్విటేషన్ లెటర్‌పై దుమారం చెలరేగింది. ఇన్విటేషన్ లెటర్‌లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ భారత్ అని ఉండటంపై విపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఇండియా పేరును భారత్‌గా మార్చారంటూ కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
ఇండియాను భారత్ అని అందరు పిలవాలని 3 రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. భారత్ అనే పేరుకు చారిత్రక ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఇది పురాతన కాలం నుంచి వాడుకలో ఉందని చెప్పుకొచ్చారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన 3 రోజులకే ఇండియా పేరు మార్చబోతున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి.
మరోవైపు విపక్షాలు కూడా తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నాయి. ఇప్పటికే 3 సమావేశాలు నిర్వహించాయి. ఈసారి ఎలాగైనా మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో కూటమికి ఈ పేరు పెట్టాయి. అయితే బీజేపీ ప్రభుత్వం ఒక్కసారిగా ఏకంగా దేశం పేరు మార్చబోతుందనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. అస్సోమ్ సీఎం హిమంత బిశ్వ శర్మ గతంలోనే ఈ విషయాన్ని ప్రస్తావించారు.