
World cup team India 2023(Cricket news today telugu) :
వన్డే వరల్డ్ కప్ కు భారత్ జట్టును ప్రకటించారు. ఓపెనర్లగా రోహిత్, శుభ్ మన్ గిల్, మిడిల్ ఆర్డర్ లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ కు చోటు దక్కింది. వికెట్ కీపర్ స్థానాన్ని ఊహించిన విధంగానే ఇషాన్ కిషన్ దక్కించుకున్నాడు. ఆల్ రౌండర్ల కోటాలో హార్థిక్ పాండ్యా, శార్ధుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కు చోటు దక్కింది. స్పిన్నర్ కోటాలో కులదీప్ కు ఛాన్స్ వచ్చింది.
పేసర్లగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ను ఎంపిక చేశారు. మొత్తంగా టీమ్ లో ఆల్ రౌండర్లతో కలిపి ఐదుగురు పేసర్లు ఉన్నారు. ముగ్గురు స్పిన్నర్లు చోటు దక్కించుకున్నారు. ఏడుగురు స్పెషలిస్టు బ్యాటర్లకు చోటు కల్పించారు. కీపర్ ఇషాన్ కిషన్ కు బ్యాకప్ గా కేఎల్ రాహుల్ ను ప్రకటించారు.
సూర్యకుమార్ యాదవ్ కు అనూహ్యంగా జట్టులో చోటు దక్కింది. టీ20ల్లో మెరుపులు మెరిపిస్తున్న సూర్య ఇప్పటి వరకు వన్డేలో ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు. కొన్ని నెలల క్రితం స్వదేశంలో ఆస్ట్రేలియాపై వరుసగా 3 మ్యాచ్ ల్లో గోల్డెన్ డక్ అయ్యాడు. సూర్య వన్డే ట్రాక్ రికార్డు ఏమాత్రం బాగులేకపోవడంతో వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కదని భావించారు. కానీ అనూహ్యంగా సూర్యకుమార్ పై సెలక్టర్లు విశ్వాసం ఉంచారు.
వన్డే వరల్డ్ కప్ కు భారత్ జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్) , శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ , ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, శార్ధుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్