India-Pak War 2025 Estimate: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం అనడం కంటే.. ఉద్రిక్తతలు కేవలం నాలుగు రోజుల్లో సద్దు మణిగాయి. ఓ వైపు అమెరికా.. మరోవైపు చైనా.. ఒత్తిడితో ఇరు దేశాలు శాంతించాయి. కేవలం చిన్న బ్రేక్ మాత్రమే. ఇరుదేశాల మధ్య పూర్తిగా ఉద్రిక్తతలు ముగియలేదు. ఈ నాలుగు రోజులపాటు ఇరుదేశాలు ఎంత ఖర్చు చేశాయి? పాక్ కంటే భారత్ ఎక్కువగా ఖర్చు చేసిందా? అవుననే అంటోంది యూఏఈకి చెందిన ఓ సంస్థ. రోజుకు రూ. 1400 నుంచి 5 వేల వరకు ఖర్చు చేసినట్టు ఓ అంచనా.
భారత్ ఖర్చు ఎంత?
భారత్-పాక్ దేశాల మధ్య యుద్ధం అంటే ఆశామాషీ కాదు. బలగాలు సరిహద్దులకు తరలించడం, ఆపై ఆయుధాలు సప్లై చేయడం, మిస్సైళ్ల ఎటాకింగ్, ఆపై ట్రాన్స్‌పోర్టు. ఇవికాకుండా సైన్యానికి ఎప్పటికప్పుడు ఆహారం, మందులు సరఫరా చేయడం నార్మల్ విషయం కాదు. ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో దాయాది దేశం పాక్ కంటే భారత్‌కు ఎక్కువ ఖర్చు ఎక్కువే. ఇదే విషయాన్ని బయటపెట్టింది దుబాయ్‌కి ఓ కంపెనీ.
భారత్ -పాకిస్తాన్ మధ్య జరిగిన దాదాపు నాలుగు రోజుల యుద్ధం జరిగింది. భారత్ తరపున రోజుకు ఎంత ఖర్చు అయ్యిందో యూఏఈకి చెందిన విదేశీ వ్యవహారాల ఫోరమ్ ఓ అంచనా వేసింది. భారత్ రోజుకు రూ. 1460 కోట్ల నుంచి రూ. 5 వేల కోట్ల ఖర్చు అవుతుందని లెక్కగట్టింది. అదే దీర్ఘ కాలిక యుద్ధం అయితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం ఖాయమని అంటోంది.
కేవల నాలుగు రోజుల యుద్ధం కంటే.. ఎక్కువ రోజులు సాగితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి కూడా. నెల రోజుల పాటు జరిగితే కలిగే నష్టం ఏకంగా 43 లక్షల కోట్లు నష్టం జరుగుతుందని ప్రస్తావించింది. దేశ జీడీపీలో దాదాపు 20 శాతం అన్నమాట. ఒక్క నెల రోజుల యుద్ధానికే నిధులు మొత్తం తుడిచి పెట్టుకుపోవచ్చని ప్రస్తావించింది. దీనివల్ల మార్కెట్లు కుప్పకూలడం, రెండోది విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. ఒక్క రీటైల్ రంగానికి భారీగా నష్టం జరగవచ్చని చెబుతోంది.
ALSO READ: కుక్కతోక వంకర, భారత్ పై యుద్ధంలో విజయం సాధించాం-పాక్ ప్రధాని
పాకిస్తాన్ మరింత లోతుల్లోకి
IMF డేటా ప్రకారం.. 2025లో భారతదేశ జీడీపీ వృద్ధి 6.2 శాతం. దాని విలువ అక్కరాలా 4.39 ట్రిలియన్ల డాలర్లు. ప్రపంచవ్యాప్తంగా నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా. ఇక పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు వద్దాం. దాయాది దేశం GDP వృద్ధి కేవలం 2.6 శాతం మాత్రమే. దాని విలువ 337.75 బిలియన్లు డాలర్లు. భారత్‌కు $ 1.8 బిలియన్లు, పాకిస్తాన్‌కు $ 1.2 బిలియన్ల నష్టాన్ని కలిగిస్తుందని గత డేటా సూచిస్తుంది.
మూలధనం బయటకు వెళ్లడం, కరెన్సీ తరుగుదల వంటివి ప్రభావం చూపుతుంది. రూపాయితో పోల్చితే డాలర్ విలువ రూ. 100 చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే పాకిస్తాన్ కరెన్సీ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. డాలర్‌కు రూ. 285కి తగ్గే అవకాశం ఉంది. పాకిస్తాన్‌తో భారత్ ఇప్పటివరకు అనేక యుద్ధాలు చేసింది. 1971 పాకిస్థాన్ వార్‌లో వారానికి 200 కోట్లు ఖర్చు అయినట్లు ఓ అంచనా. 1999 కార్గిల్ యుద్ధంలో రోజుకు 10-15 కోట్లు రూపాయలు లెక్కలు చెబుతున్నాయి. ఇవి కాకుండా వైమానిక ఖర్చులు దీనికి అదనం అన్నమాట.