BigTV English

Fake Iphone Delivery: ఫేక్ ఐఫోన్ డెలివరీ.. కస్టమర్ ఆగ్రహం.. స్పందించిన అమెజాన్..

Fake Iphone Delivery:  ఫేక్ ఐఫోన్ డెలివరీ.. కస్టమర్ ఆగ్రహం.. స్పందించిన అమెజాన్..
Fake Iphone Delivery From Amazon
Fake Iphone Delivery From Amazon

Fake Iphone Delivery From Amazon: ఈ మధ్య కాలంలో ఏ వస్తువు కొనాలన్నా ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెడుతున్నారు. మనం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా ఆయా వస్తువుకు సంబంధించిన పూర్తి సమాచారంతో ఆన్‌లైన్‌లో అమ్ముతారు. కాబట్టి ఎలాంటి శ్రమ లేకుండా వస్తువులు కొనుగోలు చేసుకుంటారు.


కానీ ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోళ్లకు సంబంధించిన వార్తలు ఈ మధ్య తరుచూ వైరల్ అవుతున్నాయి. ఒక వస్తువు ఆర్డర్ పెడితే మరో వస్తువు డెలివరీ అవుతోంది. లేదా వాడిన వస్తువో, నకిలీదో తెచ్చి ఇవ్వడం జరుగుతోంది. ఇలాంటి ఘటనలు సామాజిక మాధ్యమాల ద్వారా బయటపడుతున్నాయి. తాజాగా అలాంటీ అనుభవమే ఓ కస్టమర్ కు ఎదురైంది. ఈ విషయాన్ని అతడు ఎక్స్ (X) వెదికగా పంచుకున్నాడు.

Read More: అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు.. ఎప్పటినుండంటే..?


సోషల్‌మీడియాలో పాపులర్‌ అయిన గబ్బర్‌ సింగ్‌ అనే వ్యక్తి తాజాగా అమెజాన్‌ నుంచి ఐఫోన్‌ 15 (iPhone 15)ను ఆర్డర్‌ పెట్టాడు. డెలివరీ అందాక చూస్తే.. అది నకిలీ ఫోన్‌ అని గుర్తించి ఆశ్చర్యపోయాడు. ఈ విషయాన్ని తన ట్వీట్ ద్వారా పంచుకున్నాడు. ‘అమెజాన్‌ నాకు నకిలీ ఐఫోన్‌ 15ను డెలివరీ చేసింది. ఇందులో కేబుల్‌ కూడా రాలేదు. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారా?’ అని ఎక్స్‌లో ట్వీట్ చేసి, అమెజాన్‌ను ట్యాగ్‌ చేశాడు.

గబ్బర్‌ చేసిన పోస్ట్‌ అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెజాన్‌ విషయంలో తమకు ఎదురైన అనుభవాలను నెటిజన్లు కామెంట్ల రూపంలో పంచుకున్నారు. ‘లాప్‌ట్యాప్‌ బుక్‌ చేస్తే వాక్యూమ్‌ క్లీనర్‌ వచ్చింది’ అని ఒకరు.. ‘నోకియా 42 5జీ మొబైల్‌ ఆర్డర్‌ చేస్తే ఛార్జర్‌ లేకుండా డెలివరీ చేశారని ఇంకొకరు చెబుతున్నారు. అమెజాన్‌ సర్వీసులు బాగాలేవు అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

దీనిపై అమెజాన్ వెంటనే‌ స్పందించింది. ‘ఇలా జరిగినందుకు మమ్మల్ని క్షమించండి. ఆర్డర్‌ వివరాలు తెలియజేస్తే 12 గంటల్లో మీకు సాయం అందిస్తాం’ అంటూ సమాధానం ఇచ్చింది. ఐఫోన్‌ కోసం చెల్లించిన మొత్తాన్ని పూర్తిగా రిఫండ్‌ చేయాలని గబ్బర్‌ సింగ్ అమెజాన్‌ను కోరాడు. దీంతో తన వద్ద ఐఫోన్‌ తీసుకుని, రిఫండ్‌ను ప్రాసెస్‌ చేసినట్లు గబ్బర్ మరో పోస్ట్‌లో పేర్కొన్నాడు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×