BigTV English

MLA Lasya Nanditha Case: ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్‌ కేసు.. ఏం జరిగిందో చెప్పిన పీఏ..

MLA Lasya Nanditha Case: ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్‌ కేసు.. ఏం జరిగిందో చెప్పిన పీఏ..

MLA Lasya Nanditha Case


MLA Lasya Nanditha Case: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ కేసులో ఆమె పీఏ- డ్రైవర్ ఆకాష్ పై కేసు నమోదయ్యింది. ఆకాష్ నిర్లక్ష్యపూరితంగా కారు నడపడం వల్లే లాస్య చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఆకాష్ నుంచి పటాన్ చెరు పోలీసులు స్టేట్ మెంట్ తీసుకున్నారు. మెజిస్ట్రేట్ ముందు స్పృహలో ఉన్న ఆకాశ్ వాగ్మూలం ఇచ్చాడు.

దానిలో ఏముందుంటే.. ” దర్గా నుంచి హైదరాబాద్ చేరుకుని.. లాస్య కారులో ఉన్న అక్క కూతుర్ని వేరే కారులోకి ఎక్కించాం. లాస్య తినడం కోసం వెళ్తామని చెప్పడంతో హోటల్స్ వెతుక్కుంటూ వెళ్లాం. ప్రమాదం ఎలా జరిగిందో అర్థం అవ్వట్లేదు. ఆ టైంలో నా మైండ్ బ్లాంక్అయ్యింది.” అని ఆకాష్ పేర్కొన్నారు.


ఇక ప్రమాదం జరిగిన తీరును స్థానిక డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ముందు వెళ్తున్న వాహనం ఢీకొట్టిన తర్వాత ఎమ్మెల్యే కారు కంట్రోల్ కాక ఓఆర్ఆర్ పై లెఫ్ట్ సైడ్ రెయిలింగ్ కు ఢీ కొట్టిందన్నారు. ప్రమాదం కంటే ముందే కారు ముందు భాగం పగిలి కింద పడిపోయి ఉందన్నారు. నిర్లక్ష్యంగా అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని వెల్లడించారు.

Read More: మేడారంకు 1.35 కోట్ల మంది భక్తులు.. రూ.100 కోట్ల నిధులతో వసతులు..

లాస్య నందిత సోదరి నివేదిక ఫిర్యాదుతో ఆకాష్ మీద ఐపీసీ సెక్షన్ 304 ఏ కింద పటాన్ చెరు పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. శుక్రవారం ఉదయం 5గంటల 15 గంటలకు ఆకాష్ తమకు ఫోన్ చేశాడని తెలిపారు. ప్రమాదం జరిగిందని.. ఇద్దరికీ దెబ్బలు తగిలాయని లోకేషన్ షేర్ చేశాడని నివేదిత ఫిర్యాదులో పేర్కొన్నారు. తీరా స్పాట్ కు వెళ్లి చూస్తే కారు నజ్జు నుజ్జు అయి కారు మాత్రమే ఉందని ఆమె తెలిపారు.

పోలీసులు వెళ్లడించిన వివరాల ప్రకారం.. సదాశివపేటలో ఓ దర్గాలో మొక్కులు చెల్లించడానికి ఎమ్మెల్యే లాస్య నందిత తన కుటుంబ సభ్యులతో వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొచ్చి కుటుంబ సభ్యులను ఇంటి దగ్గర దింపిన తర్వాత టిఫిన్ కోసం సంగారెడ్డి వైపు వెళ్లారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. ప్రమాదంలో లాస్య చనిపోగా.. ఆకాష్ కాళ్లు విరిగాయి. షామీర్ పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డు పైకి లాస్య కారు ఎంట్రీ అయినట్లు పోలీసులు గుర్తించారు. నిద్ర మత్తులోకి జారిపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు ఆకాష్ చెప్తున్నప్పటికీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×