BigTV English

Dangerous Cobra Video: బావిలో పడ్డ నాగుపాము.. సహాయం చేయబోయిన వ్యక్తిపైకి ఎలా ఎగిసి పడుతుందో చూడండి!

Dangerous Cobra Video: బావిలో పడ్డ నాగుపాము.. సహాయం చేయబోయిన వ్యక్తిపైకి ఎలా ఎగిసి పడుతుందో చూడండి!
King Cobra
King Cobra

Man Rescues King Cobra : మన సమాజంలో హీరోలు,సూపర్ హీరోలు ఎందరో ఉన్నారు. వారు తమ ప్రాణాలను సైతం పణంగాపెట్టి ఇతరులను రక్షిస్తుంటారు. అటువంటి ఓ సూపర్ హీరోకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వ్యక్తి పామును రక్షించడానికి తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


ఒక కింగ్ కోబ్రా ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. బయటపడే మార్గం లేక నిస్సహాయ స్థితిలో బావిలొనే ఉండిపోయింది. ప్రజలు చాలా మంది ఆ పామును దూరం నుంచి చూస్తూ ఉన్నారు. ఇంతోనే ఓ యువకుడు వచ్చి ఆ పామును తన చేతితో పట్టుకొని బయటకు తీశాడు. ఆప్పుడు ఆ పాము పడిగ విప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది.

Read More: ముసలోడే కానీ మామూలోడు కాదు.. జస్ట్ మిస్.. ముసలోడి ఆధార్ కార్డ్ చిరిగిపోయేది!


ఆ యువకుడు మాత్రం ధైర్యంగా దాని తోక పట్టుకోని బయటకు లాగాడు. ఈ సందర్భంలోనే కాటు కూడా వేయబోయింది. ఈ ఘటన చూసిన అక్కడి ప్రజలు యువకుడిని ఎక్కడ కాటు వేస్తుందోనని భయంతో వణికిపోయారు. కానీ, ఆ యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు.

అయితే సంఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ వీడియోస్ అనే ఎక్స్ అకౌంట్ నుంచి ఈ వీడియో అప్లోడ్ అయ్యింది. కొద్ది సమయంలోనే ఈ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. చాలా మంది యువకుడి శ్రేయస్సు గురించి ఆందోళన చెందారు. కొందరు అతడు తన ప్రాణాలను రిస్క్‌లో బెట్టి పామును రక్షించడం మంచిది కాదని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పామును విజయవంతంగా రక్షించినందుకు ప్రశంసించారు.

Read More: ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. 26 అడుగులు.. 440 lbs బరువు.. వామ్మో చూస్తే అంతే సంగతి!

ఆ పాము యువకుడిని దాదాపు కాటు వేయడానికి దగ్గరకు వచ్చింది.. నాకు పాములంటే చాలా భయం అని ఒక వ్యక్తి అన్నాడు. నానైతే ఆ పామును చూసిన వెంటనే పారిపోయేవాడినని కామెంట్ చేశాడు. మీరు కూడా ఈ వీడియో చూసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Tags

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×