BigTV English

Youtube New Rules: వీడియో క్రియేటర్లకు బిగ్ షాక్.. యూట్యూబ్‌ కొత్త నిబంధన..?

Youtube New Rules: వీడియో క్రియేటర్లకు బిగ్ షాక్.. యూట్యూబ్‌ కొత్త నిబంధన..?

Youtube New RulesYoutube New Rules: ప్రస్తుతం చేతిలోకి స్మార్ట్ ఫోన్, అపరిమిత ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక అందరూ వాటికి బానిస అయిపోతున్నారు. అయితే ఫోన్ లో ఉండే చాలా యాప్స్ ను రోజంతా చూస్తూ సమయం కూడా తెలియకుండా ఇట్టే గడిపేస్తున్నారు. కొందరైతే యూట్యూబ్ ఉంటే చాలు అందులో ఉండే విడియోస్ చూస్తూ కాలం వెల్లదీస్తుంటారు. కొందరు అయితే ఈ యూట్యూబ్ లో విడియోలు చూస్తూ కాలం గడుపుతుంటే.. మరికొందరు మాత్రం అందులో అప్ లోడ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అయితే వీడియోస్ అప్ లోడ్ చేసే వారి కోసం యూట్యూబ్ త్వరలోనే కొత్త రూల్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది.


జనరేషన్ జెడ్ యుగంలో అంతా కృత్రిమ మేధ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏఐ టెక్నాలజీ అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత కొన్ని విడియోలు మార్ఫింగ్ చేస్తే ఏది నకలో, ఏది ఒరిజనల్ లో తెలుసుకోవడం కష్టంగా మారింది. అయితే కొందరు అటువంటి ఫేక్ వీడియోస్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు. దాన్ని చూసిన వారు నిజమే అనుకుని నమ్ముతున్నారు. ఇటువంటి వీడియోస్ పైన కేంద్రం సైతం ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే అలా వస్తున్న కంటెంట్ లో ఎంత వరకు నిజం ఉందో, యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్న విడియో, ఆడియో, వాయిస్ నిజంగా వారివేనా అని తెలుసుకునేందకు కొత్త నియమావళిని తీసుకురాబోతోంది.

ఇటువంటి సమస్యను పరిష్కరించేందుకు యూట్యూబ్ కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. కృత్రిమ మేధతో క్రియేటర్స్ క్రియేట్ చేసే విడియోలకు సంబంధించిన యూట్యూబ్ త్వరలోనే కొన్ని నియమాలను ప్రకటించనుంది. యూట్యూబ్ లో విడియోలు అప్ లోడ్ చేసేముందు కొందరు జనరేటర్ ఏఐ క్లిప్స్, కొన్ని ఏఐ టూల్స్ వినియోగిస్తుంటారు. దీంతో వీటిని చూసిన వినియోగదారులు అవి నిజమైనవేననే భ్రమలో ఉంటారు.


Also Read: Best and Top 10 Selling Bikes: మన దేశంలో సెల్లింగ్‌లో ఈ బైకులే కింగ్.. డోంట్ మిస్ ఇట్!

అయితే ఇకపై అలా చేసే వారు తమ వీడియోలకు లేబులింగ్ ఇవ్వాలని యూట్యూబ్ కొత్త నియమం తీసుకురానుంది. దీంతో వీడియో ఫుటేజీలో మార్పులు చేసేవారు, ఇతర పద్దతుల్లో ఆ వీడియోను వాడుకుంటున్నావారు, రియల్ వాయిస్ ను మార్చే వారు ఇకపై తమ వీడియోలో లేబుల్ ని చేర్చాల్సి ఉంటుందని తెలిపింది. దాన్ని కూడా డిస్క్రిప్షన్ రూపంలో లేదా వాయిస్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుందని ప్రకటించింది. ఈ నిబంధనలు పాటించడంలో విఫలమైతే వారిపై చర్యలు తీసుకుంటామని యూట్యూబ్ తెలిపింది.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×