E-Paper
Advertisement

Cyclone Hamoon : తీవ్రతుపానుగా హమూన్.. మత్స్యకారులకు హెచ్చరిక

Cyclone Hamoon : తీవ్రతుపానుగా హమూన్.. మత్స్యకారులకు హెచ్చరిక
Advertisement

Cyclone Hamoon : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం (అక్టోబర్ 24) సాయంత్రం తుపానుగా, ఆ తర్వాత తీవ్రతుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపానుకు ఇరాన్ సూచించిన హమూన్ అనే పేరును పెట్టారు. హమూన్ సైక్లోన్.. సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయానికి ఒడిశాలోని పారాదీప్ కు 230 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ లోని ధిగాకు 360 కిలోమీటర్ల దూరంలో, బంగ్లాదేశ్ లోని హెపుపరాకు 510 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. ఇది గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతూ.. మరో మూడు గంటల్లో అతితీవ్రతుపానుగా రూపాంతరం చెందనున్నట్లు వివరించింది.

రానున్న 12 గంటల్లో ఈ తుపాను వాయువ్య బంగాళాఖాతంలో మరింత బలపడి తీవ్రతుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అక్టోబర్ 25న బంగ్లాదేశ్ లోని హెపుపరా, చిట్టగాంగ్ మధ్య తీరదాటవచ్చని అంచనా వేసింది. 26వ తేదీ వరకూ తుపాను ప్రభావం బంగ్లాదేశ్ పై ఉంటుందని పేర్కొంది. ఈ తుపాను ప్రభావం ఒడిశాపై ఉండవచ్చని ఐఎండీ చెప్పింది. మంగళ, బుధవారాల్లో ఒడిశాలో మోస్తరు వర్షపాతంతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు సూచించారు. పశ్చిమబెంగాల్ లోనూ ఉరుములతో కూడిన వర్షపాతం నమోదు కావొచ్చని తెలిపారు. ఈ తుపాను ప్రభావం.. ఒడిశాపై నేరుగా లేనప్పటికీ.. మత్స్యకారులెవరూ అక్టోబర్ 26 వరకూ సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×