E-Paper
Advertisement

అష్టదిగ్బంధనంలో రాజధాని ఢిల్లీ.. 26 వేల మంది బలగాల మోహరింపు, లిక్కర్ షాపులు క్లోజ్

అష్టదిగ్బంధనంలో రాజధాని ఢిల్లీ.. 26 వేల మంది బలగాల మోహరింపు, లిక్కర్ షాపులు క్లోజ్
Advertisement

Delhi: దేశ రాజధాని ఢిల్లీ అష్ట దిగ్బంధనంలోకి వెళ్లింది. నాలుగు రోజులుగా ఇండియా కూటమి ఆందోళనలతో పరిసర ప్రాంతాలు స్తంభించాయి. నేడు, రేపు దాదాపు 50 వేల మంది నిరసనకారులు ప్రవేశించే అవకాశం ఉందని అంచనా నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. హస్తిన నగరవీధుల్లో ఎటు చూసినా పోలీసులు కనిపిస్తున్నారు.

అష్టదిగ్బంధనంలో రాజధాని ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు ఏ మాత్రం తగ్గలేదు. రోజు రోజుకూ ఉధృతమవుతున్నాయి. రోజుకో ఒకరు ఆందోళనలకు దిగడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వరుసగా నాలుగు రోజులు ఇండియా కూటమి ఆందోళనలతో సెంట్రల్ ఢిల్లీ పరిసరాలు స్తంభించాయి.

వీకెండ్ పెద్ద ఎత్తున ఆందోళనలు,  50 వేల మంది నిరసన కారులు వచ్చే అవకాశం

Advertisement

వీకెండ్ జంతర్ మంతర్‌లో నిరసనలకు సీజేపీ- వామపక్ష విద్యార్థి సంఘాలు రెడీ అయ్యాయి. వరుస ఆందోళనలతో వేలాదిగా బలగాలను మోహరిస్తోంది కేంద్రం. వీకెండ్ నిరసనలకు శనివారం ఢిల్లీలోకి దాదాపు 50 వేల మంది నిరసనకారులు ప్రవేశించే అవకాశం ఉందని సమాచారంతో పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ పోలీసులకు అదనంగా దాదాపు 26 వేల మంది సాయుధ బలగాల మోహరించారు. బెంగాల్, చత్తీస్‌ఘడ్ నుంచి 7 వేల మంది సీఆర్పీఎఫ్ బలగాలకు ఢిల్లీకి చేరుకుంటున్నాయి.

26 వేల మంది బలగాలను మోహరించిన కేంద్రం

ఢిల్లీలోకి ప్రవేశించే అన్ని సరిహద్దు మార్గాల్లో భారీగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. సోమవారం వరకు ఢిల్లీలో భారీ ఎత్తున బలగాలు ఉండనున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో దాదాపు 5 వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. వీరికి అదనంగా మరో 10 వేల మంది బలగాలను మొహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. జంతర్ మంతర్, పార్లమెంటు వైపు వెళ్లే మార్గాల్లో భారీగా బారికేడ్స్ ఏర్పాటు చేశారు.

హోటళ్లలో ముమ్మరంగా తనిఖీలు, జర్నలిస్టులకు సూచనలు

Advertisement

శుక్ర, శనివారాల్లో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత-BNSS సెక్షన్ 163 కింద నిషేధ ఉత్తర్వులను ఉటంకిస్తూ ఢిల్లీ పోలీసులు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. ఇక హోటళ్లను ఉదయం, సాయంత్ర వేళ నిత్యం తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ల తర్వాత ఓ నిరసన ప్రదర్శన కోసం ఈ స్థాయిలో బలగాలను మోహరించడం ఇదే మొదటిసారి. హోం శాఖ ఆదేశాల మేరకు అక్టోబర్ 8 నుండి 12 వరకు దాదాపు 221 కేంద్ర సాయుధ పోలీసు బలగాల కంపెనీలు అంటే సుమారు 23,000 మంది సిబ్బందిని అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

న్యూఢిల్లీ ఏరియాలో 5 వేల నుంచి 15 వేలకు బలగాలను పెంచింది. సెంట్రల్ ఢిల్లీ హోటళ్లలో బుకింగ్‌లను పరిమితం చేయాలని ప్రభుత్వం కోరినట్లు సమాచారం. పోలీసులు హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, పేయింగ్-గెస్ట్ వసతి గృహాలను తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పదంగా భావిస్తున్న అతిథులను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 8 నుండి 11 మధ్య యువత ఉండేందుకు వేరొకరి పేరు మీద బుక్ చేయబడిన గదులు పరిశీలన చేస్తున్నారు. ఎవరినీ ఆపడం గానీ, అదుపులోకి తీసుకోవడం గానీ జరగలేదని, కేవలం విచారిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీకి వెళ్తున్న గోవా ఎక్స్‌ప్రెస్‌లో 21 మందిని అదుపులోకి తీసుకున్నట్లు భోపాల్ రైల్వే పోలీసులు తెలిపారు.

ALSO READ: భర్తపై భార్య కాళికారూపం.. గొంతుపై కాలు పెట్టి పిల్లలతో కలిసి, ఒడిషాలో షాకింగ్ ఘటన

నిరసన బృందంలో ప్రయాణిస్తున్నారనే ఆరోపణలపై నిర్బంధించారని ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఆరోపించారు. యూట్యూబర్స్, మొబైల్ జర్నలిస్టుల పైనా పోలీసులు ఆంక్షలు పెట్టారు. విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న హెచ్చరిస్తున్నారు. మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ధరించాలని సూచన చేస్తున్నారు.

Related News

భర్తపై భార్య కాళికారూపం.. గొంతుపై కాలు పెట్టి పిల్లలతో కలిసి, ఒడిషాలో షాకింగ్ ఘటన

మెట్రో పనుల సమీపంలో కుంగిన రోడ్డు.. గుంతలో పడి బోల్తా కొట్టిన కారు

అమెజాన్ ఆఫీసు బయట పేలుడు.. పలువురికి గాయాలు, బెంగుళూరులో ఘటన

మా లాయర్లలో మంచి నటులున్నారు.. వారితో సినిమా తీయండి: సుప్రీంకోర్టు

సీఈసీ నియామక వివాదంలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన సీజేఐ బెంచ్!

పెట్రోల్ బంక్ సీజ్ వివాదం.. ఇండియన్ ఆయిల్ అధికారి దారుణ హత్య.. కేంద్రమంత్రి కీలక ఆదేశాలు!

నడిరోడ్డుపై పడుకుని ప్రియాంక నిరసన.. రాహుల్‌ను ఎత్తుకెళ్లిన పోలీసులు, ఢిల్లీలో హైటెన్షన్!

Big Stories

Advertisement
×