E-Paper
Advertisement

పోస్టల్ శాఖలో జాబ్స్.. జిడిఎస్ ఉద్యోగ ఖాళీలు, సాలరీ వివరాలివిగో

పోస్టల్ శాఖలో జాబ్స్.. జిడిఎస్ ఉద్యోగ ఖాళీలు, సాలరీ వివరాలివిగో
Advertisement

India Post Jobs| ఇండియా పోస్ట్ 2026లో గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకంలో బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులు ఉన్నాయి. జిడిఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 2, జూలై 2026 నోటిఫికేషన్‌ ఆగస్టు 20న విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ నంబర్ 17-12/2026-GDSగా ఉంది. అర్హత ఉన్న అభ్యర్థులు నిర్ణయించిన గడువులో రిజిస్ట్రేషన్, దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

జిడిఎస్ రిక్రూట్‌మెంట్ 2026లో ముఖ్యమైన తేదీలు

వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 31, 2026న ప్రారంభమవుతుంది.
అభ్యర్థులు సెప్టెంబర్ 19, 2026 సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 2న ప్రారంభమవుతుంది.
అభ్యర్థులు సెప్టెంబర్ 21, 2026 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేయవచ్చు.
అదే గడువు వరకు అప్లికేషన్ ఫీజును కూడా చెల్లించాలి.
దరఖాస్తుల్లో తప్పులు సరిచేసుకునేందుకు సెప్టెంబర్ 23, 24 తేదీల్లో అవకాశం ఉంటుంది.
కరెక్షన్ విండో సెప్టెంబర్ 24న సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.

GDS పోస్టులకు సాలరీ ఎంత?

Advertisement

ఎంపికైన అభ్యర్థులకు టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలోవెన్స్ (TRCA) విధానంలో చెల్లింపులు జరుగుతాయి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) పోస్టులకు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు TRCA లభిస్తుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టులకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు TRCA అందుతుంది.
డాక్ సేవక్ పోస్టులకు కూడా రూ.10,000 నుంచి రూ.24,470 వరకు లభిస్తుంది.
నిబంధనల ప్రకారం.. TRCAలో ప్రతి సంవత్సరం 3 శాతం పెంపు ఉంటుంది.
అర్హత ఉన్న GDS ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ కూడా లభిస్తుంది. వీటితో పాటు ఆఫీస్ మెంటెనెన్స్ అలవెన్స్, సైకిల్ లేదా బైక్ అలవెన్స్ (అవసరమైతే) కూడా లభిస్తుంది. అదనంగా GDS గ్రాడ్యుటీ, సర్వీస్ డిశ్చార్జ్ బెనిఫిట్ స్కీమ్ వంటి ప్రయోజనాలు ఉంటాయి.

జిడిఎస్ రిక్రూట్‌మెంట్ 2026 దరఖాస్తు ఫీజు ఎంత?

నోటిఫై చేసిన GDS పోస్టులకు సాధారణ దరఖాస్తు ఫీజు రూ.100. అభ్యర్థి ఎంచుకున్న డివిజన్‌లోని పోస్టులకు ఈ ఫీజు వర్తిస్తుంది. అయితే కొన్ని వర్గాలకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
SC, ST అభ్యర్థులకు కూడా ఫీజు మినహాయింపు ఉంటుంది. దివ్యాంగులకు అంటే (PwBD) అభ్యర్థులకు మినహాయింపు వర్తిస్తుంది. ట్రాన్స్‌వుమెన్ అభ్యర్థులు కూడా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఫీజు ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలి?

Advertisement

అర్హత ఉన్న అభ్యర్థులు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుతో ఫీజు చెల్లించవచ్చు. నెట్ బ్యాంకింగ్, UPI ద్వారా కూడా ఆన్‌లైన్ పేమెంట్ చేసేందుకు అవకాశం ఉంది.
ఒక్కసారి చెల్లించిన దరఖాస్తు ఫీజు తిరిగి రీఫండ్ చేయబడదు.

Also Read: ఉద్యోగాలు ఫుల్ చేసేవారు నిల్.. లక్షల్లో జీతం, మీరు చేస్తారా?

అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు ఈ విషయాలు పరిశీలించాలి

ముందుగా వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. తర్వాత వ్యక్తిగత, విద్యార్హత, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాలి. అవసరమైన పత్రాలను నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తును సమర్పించే ముందు నమోదు చేసిన వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేయాలి.

Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తొలిసారి తీసుకుంటున్నారా? ముందు ఈ 4 విషయాలు తప్పక చెక్ చేయండి

రిజిస్ట్రేషన్ వివరాలు, అప్లికేషన్ కాపీ, ఫీజు చెల్లింపు రసీదును భద్రంగా ఉంచుకోవాలి.
అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.
తాజా నియామక నిబంధనలు, తేదీలు, ఫీజు వివరాలను అధికారిక సమాచారంతో నిర్ధారించుకోవాలి.

గమనిక: నియామక తేదీలు, నిబంధనలు, ఫీజులు, జీతాలు మారే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ముందు ఇండియా పోస్ట్ అధికారిక నోటిఫికేషన్‌లో తాజా వివరాలను తప్పనిసరిగా పరిశీలించండి.

Tags

Related News

నేపాల్‌లో ప్రకృతి బీభత్సం.. ఢిల్లీ-ఖాఠ్మండు బస్సు సర్వీసుకు అంతరాయం

ఓరి దేవుడా.. పదో అంతస్తు నుంచి దూకినా.. యువతికి ఏం కాలేదు!

నేపాల్ జల ప్రళయం.. 288 మంది భారతీయులు మిస్సింగ్.. 21 మంది సురక్షితమన్న కేంద్రం

ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన మల్లికార్జున ఖర్గే!

ఇంట్లోనే మోడల్ దారుణ హత్య.. నిందితుడు జిమ్ ట్రైనర్? ఢిల్లీలో దారుణమైన ఘటన

కాన్పూర్‌లో కూలిన విమానం.. ఒక పైలట్ మృతి, మరొకరు పరిస్థితి-అసలు ఏం జరిగింది?

నా బూట్లు నీతో కడిగిస్తాను.. సెక్యూరిటీ గార్డుపై ఓ మహిళ చిందులు, గ్రేటర్ నొయిడాలో ఘటన, వీడియో వైరల్

Big Stories

Advertisement
×