Mumbai Woman: సాధారణంగా పదో అంతస్తు ఎత్తు నుంచి ఒక మనిషి దూకితే బతకడం చాలా కష్టం. కానీ ముంబైలో ఒక మహిళ విషయంలో ప్రకృతి ఓ అద్భుతాన్నే చేసి చూపించింది. భవనం పైనుంచి కిందకు దూకిన ఒక యువతి నేరుగా నేలను తాకకుండా పక్కనే ఉన్న చెట్టు కొమ్మల్లో చిక్కుకోవడంతో తృప్తిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది.
ముంబైలోని ఓ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో బుధవారం ఉదయం ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. 26 ఏళ్ల ప్రతీక్ష హివ్రాలే అనే మహిళ 21 అంతస్తుల భవనంలోని 10వ అంతస్తు నుంచి హఠాత్తుగా కిందకు దూకేసింది.
#Mumbai Bhandup: A woman fell from the 10th floor of the Sunshine SRA building but survived after getting caught in the branches of a large tree below. Fire brigade personnel rescued her safely. Police are probing how she fell and her current condition. pic.twitter.com/w0plsn8tCi
— Siraj Noorani (@sirajnoorani) August 26, 2026
కిందకు పడుతున్న సమయంలో భవనం పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు ఆమెను కాపాడింది. సుమారు 50-60 మిమీ మందం ఉన్న కొమ్మ ఆమె కుడి పాదంలోకి దూసుకుపోవడంతో ఆమె నేలపై పడకుండా భూమికి 20-25 అడుగుల ఎత్తులో చెట్టుకే వేలాడుతూ ఉండిపోయింది.
ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా.. చెట్టుకు వేలాడుతున్న యువతిని స్థానికులు గమనించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. నిచ్చెనల సాయంతో పైకి చేరుకొని జాగ్రత్తగా కొమ్మను నరికారు. తీవ్రగాయాలైన ఆమెను సురక్షితంగా కిందకు దింపారు.
Also Read: నేపాల్ జల ప్రళయం.. 288 మంది భారతీయులు మిస్సింగ్.. 21 మంది సురక్షితమన్న కేంద్రం
చెట్టు వల్ల యువతికి ప్రాణాలు దక్కినప్పటికీ.. తొడలోకి కొమ్మ గుచ్చుకోవడంతో ఆమె కాలు తీవ్రంగా దెబ్బతిన్నది. రెస్క్యూ అనంతరం స్పృహ కోల్పోయిన ఆమెను మొదట స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం సియాన్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ప్రస్తుతం ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాతే ఘటనకు గల కారణాలపై ప్రకటన నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.
Also Read: 1871లో మనుషుల్లేని ద్వీపంలోకి 5 ఆవులు.. 137 ఏళ్ల తర్వాత అక్కడ ఉన్నది చూసి.. శాస్త్రవేత్తలే షాక్!