Big Stories

Delhi Pollution Kejriwal Decision : ఏడాది సమయం ఇవ్వండి.. ఢిల్లీ కాలుష్య సమస్య పరిష్కరిస్తా : అరవింద్ కేజ్రీవాల్

Delhi Pollution Kejriwal Decision : ఢిల్లీలో కాలుష్యం నివారణకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. గతంలో అమలు చేసిన సరి-బేసీ విధానాన్నే అమలు మళ్లీ అమలు చేయనున్నారు. దేశంలో అన్ని నగరాల్లో కంటే ఢిల్లీలో కాలుష్యం తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. చలికాలంలో కాలుష్య తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమస్యను కొంత మేర పరిష్కరించడానికి ఢిల్లీలో ప్రైమరీ స్కూళ్లను మూసివేస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కేవలం 5వ తరగతుల వారికి మాత్రమే స్కూళ్లకు అనుమతించాలని ఆయన నిర్ణయించారు.

- Advertisement -

ఢిల్లీలో కాలుష్యానికి పంజాబ్‌లో పంటలు దహనమే కారణమని కేజ్రీవాల్ పై ప్రతిపక్షాలు విరుచుకుపడుతన్నాయి. కేజ్రీవాల్ అసమర్ధత వల్ల పంజాబ్‌లో పంట వ్యర్ధాలు పెరిగిపోయాయని.. రైతులు వీటిని దహనం చేయడం వల్ల ఆ కాలుష్యం ఢిల్లీని ఆవరించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను కూడా సీఎం కేజ్రీవాల్ తనదైన శైలిలో తిప్పికొట్టారు.

- Advertisement -

కేవలం పంజాబ్‌లో మాత్రమే పంటవ్యర్ధ దహనాలు జరగడం లేదని.. దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా పంట దహనం జరుగుతోందని అన్నారు. ఢిల్లీతో పాటు పంజాబ్‌లో కూడా ఆమ్‌ఆద్మీపార్టీనే అధికారంలో ఉందని.. పంజాబ్ పంట దహన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 6 నెలలే అయిందని.. ఒక ఏడాది సమయం ఇస్తే.. ఢిల్లీ కాలుష్య సమస్యను కొంత మేర పరిష్కరిస్తామని అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News