Imran Khan After Attack : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిగిన తరువాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. కాల్పుల నుంచి తనను ఆ దేవుడు.. అల్లానే కాపాడాడని అన్నారు. దేవుడు తనకు పునర్జన్మనిచ్చాడన్నారు పాక్ మాజీ ప్రధాని.
గురువారం పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ.. ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో వజిరిస్తాన్‌లో నిరసన ర్యాలీ చేపడుతుండగా ఆయనపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్‌తో సహా ఆరుగరికి తీవ్ర గాయాలవగా ఓ వ్యక్తి మృతి చెందాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అప్పటికప్పుడే అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన నిందుడిని ప్రశ్నించగా.. తాను కేవలం ఇమ్రాన్ ఖాన్‌ను మాత్రమే చంపాలనుకున్నానని.. వేరే ఎవ్వరినీ గాయపర్చాలనే ఉద్దేశ్యం లేదన్నట్లు చెప్పుకొచ్చాడు.
అయితే ఇమ్రాన్ ఖాన్‌పై జరిగిన దాడిని ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. కాల్పులు జరిగిన నిందితుడికి కూడా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు ఇంకా తేలలేదు. ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరగడంతో.. ఆయన పార్టీ కార్యకర్తలు మద్దతుదాలులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. శుక్రవారం ప్రార్ధనల అనంతరం మరింత ఉదృతంగా నిరసన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్‌పై దాడితో పాకిస్థాన్‌లో ఉద్రక్త పరిస్థితులు నెలకొన్నాయి.