BigTV English

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Who is Next CM in Delhi: ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ పై తీహార్ జైలు నుంచి రిలీజ్ అయిన 48 గంటల్లోనే ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన సంచలన ప్రకటన దేశ రాజధానిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ సీఎం పదవికి 48 గంటల్లోగా రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆప్ కార్యకర్తలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వీరితో పాటు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు కూడా స్టన్ అయ్యాయి.


ఈ విషయంలో కేజ్రీవాల్ ఆలోచనను ఏ పార్టీ కూడా అంచనా వేయలేకపోయాయి. ఎన్నికల వ్యూహాలు పన్నడంలో మోదీ, అమిత్ షాను మించిన నాయకుడిగా కేజ్రీవాల్‌కు పేరుంది. ఏదో పెద్ద స్కెచ్ వేసే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం తదుపరి సీఎం ఎవరనేది దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

కేజ్రీవాల్ సంచలన ప్రకటనతో ఆమ్ ఆద్మీ పార్టీలో తదుపరి సీఎం ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. కొంతమంది నేతలు సీఎం పదవిని వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు తన భార్యకు కేజ్రీవాల్ అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే మరికొంతమంది కేజ్రీవాల్ అలా చేసే ప్రసక్తే లేదని, కుటుంబ వారసత్వ పార్టీగా ఆప్‌ని మార్చే సాహసం కానీ ఆ ఆలోచన కేజ్రీవాల్‌కు లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


ఇక, మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్ జైలులో ఉండటంతో మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లు మాత్రమే పార్టీలో కీలక నేతలుగా కొనసాగుతున్నారు. ఈ తరుణంలో కేజ్రీవాల్ భార్య సునీతా అధికారం చేపట్టే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది.

అలాగే, సీఎం పదవిని ఇతరులకు ఇస్తే పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తే ప్రమాదం ఉందని కొంతమంది నేతలు చెబుతుండగా..ఇతర నేతలకు పదవి ఇచ్చిన తర్వాత వారి నుంచి తిరిగి బాధ్యతలు తీసుకోవడం అంత సులువైన పని కాదని బీహార్, జార్ఖండ్ రాజకీయ ఉదంతాలతో అర్ధమవుతోందని అంటున్నారు.

Also Read: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

ఢిల్లీ తదుపది సీఎం ఎవరనే విషయంపై ఆప్ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో పలువురి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇందులో చాలామంది సీనియర్ నేతల పేర్లు వినపిస్తున్నాయి. సీఎం భార్య ప్రముఖంగా వినిపిస్తుండగా.. ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుల్లో అతిషి, సౌరభ్ భరద్వాజ్, కైలాష్ గహ్లోట్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్ వంటి పేర్లు ప్రచారంలో కొనసాగుతున్నాయి. అలాగే దళిత నాయకుడికి తదుపరి సీఎం అవకాశం ఇవ్వవచ్చని కొంతమంది నేతలు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, ప్రస్తుత పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 11తో ముగియనుంది. ఢిల్లీలో గత అసెంబ్లీ ఎన్నికలు 2020 ఫిబ్రవరి 8న జరిగాయి. ఈ ఎన్నికల్లో 70 మంది సభ్యులకు గానూ ఆప్ పార్టీ 62 సీట్లు గెలుపొందగా.. బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది.

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×