BigTV English
Advertisement

Ayodhya : రామయ్య మీద భక్తి .. అయోధ్యకు రూ. 68 కోట్లు విరాళం..

Ayodhya : అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరిగింది . ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాలు నుంచి ప్రముఖులు, భక్తులు భారీగా హాజరు అయ్యారు. రామ మందిర నిర్శాణానికి భారీగా ప్రపంచ దేశాలు నుంచి భక్తులు విరాళాలు అందించారు. వ్యాపార వేత్తలు నుంచి సాధారణ ప్రజల వరకు ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించారు. అనేక మంది వివిధ రకాలుగా విరాళాలు అందించారు.

Ayodhya :  రామయ్య మీద భక్తి .. అయోధ్యకు రూ. 68 కోట్లు విరాళం..

Ayodhya : అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరిగింది . ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాలు నుంచి ప్రముఖులు, భక్తులు భారీగా హాజరు అయ్యారు. రామ మందిర నిర్శాణానికి భారీగా ప్రపంచ దేశాలు నుంచి భక్తులు విరాళాలు అందించారు. వ్యాపార వేత్తలు నుంచి సాధారణ ప్రజల వరకు ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించారు. అనేక మంది వివిధ రకాలుగా విరాళాలు అందించారు.


శ్రీరామునికి భారీ విరాళం అందించిన వారిలో దిలీప్‌ కుమార్‌ వి లాఖి ఇచ్చారు. సూరత్‌కు చెందిన దిలీప్ కుమార్ వజ్రాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆయన శ్రీరాముని ఆలయానికి 101 కేజీల బంగారాన్ని కానుకగా ఇచ్చారు. ఈ బంగారాన్ని గర్భగుడి, రామాలయం తలుపులు, డమరు, త్రిశూలం, పిల్లర్లకు కేటాయించారు. ప్రస్తుత మార్కెట్‌లో 10 గ్రాములు బంగారం ధర రూ.68వేల రూపాయలుగా ఉంది. రామాలయానికి లాఖి కుటుంబం సుమారు రూ.68 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. రామ మందిర ట్రస్ట్‌కు ఇప్పటివరకు వచ్చిన విరాళాల్లో ఇదే అత్యధిక విరాళంగా తెలుస్తొంది.

ఈయనే కాకుండా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరాయ్‌ బాపూ రూ.11.3 కోట్లరుపాయలు రామ మందిరానికి విరాళంగా చెల్లించారు. కెనడా, అమెరికా, బ్రిటన్‌లో నివసిస్తున్న రామ భక్తులు రూ.8 కోట్ల రుపాయలు కానుకగా ఇచ్చారు. ఇక గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద భాయ్‌ ఢోలాకియా రూ.11 కోట్ల రుపాయలు విరాళమిచ్చారు.



రామ మందిరానికి కోటి రూపాయలు విరాళం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఒక వ్యక్తి తనకు ఉన్న 16 ఎకరాల పొలాన్ని అమ్మేశాడు. అయితే కోటి రూపాయల్లో 15 లక్షలు రూపాయలు తక్కువ అవ్వడంతో మరొక వ్యక్తి వద్ద అప్పు తెచ్చుకున్నాడు. అలా వచ్చిన మొత్తం కోటి రూపాయలు కలిపి మందిర నిర్మాణానికి విరాళంగా ఇచ్చాడు. రామ మందిర నిర్మాణానికి దేశ వ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్ సభ్యులు విరాళాలు సేకరించారు. 20 లక్షల మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. దేశవ్యాప్తంగా 12.7 కోట్ల కుటుంబాల నుంచి రూ. 2100 కోట్ల రూపాయలను రామ మందిరానికి విరాళంగా అందాయి.

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×