BigTV English

CBSE Open Book Exam: సీబీఎస్‌ఈ పరీక్ష‌ల్లో ఓపెన్ బుక్ విధానం?

CBSE Open Book Exam: సీబీఎస్‌ఈ పరీక్ష‌ల్లో ఓపెన్ బుక్ విధానం?

CBSE Open Book Exam: ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్స్(OBE) విధానాన్ని ప్రవేశపెట్టాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) యోచిస్తోంది. 9 నుంచి 12వ తరగతి పరీక్షల్లో ఈ విధానాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయని సీబీఎస్ఈ మీడియా-పీఆర్ డైరెక్టర్ రమాశర్మ ధ్రువీకరించారు.


నిరుడు జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగిందన్నారు. ఈ ఏడాది నవంబర్ నెలలో పైలట్ పరీక్ష నిర్వహిస్తారని విశ్వసనీయంగా తెలిసింది. 9, 10 తరగతుల మేథమెటిక్స్, సైన్స్, ఇంగ్లిష్ పరీక్షలను ఎంపిక చేసిన స్కూళ్లలో ఓపెన్ పద్ధతిలో నిర్వహిస్తారు. అలాగే 11, 12 తరగతుల బయాలజీ, ఇంగ్లిష్, మేథమెటిక్స్ సబ్జెక్టు్లో పైలట్ పరీక్ష ఉంటుంది.

Read More: వాలినాథ్ ధామ్ ఆలయం ప్రారంభోత్సం.. అమూల్ స్వర్ణోత్సవ వేడుకలు..


అన్ని స్కూళ్లల్లో ఓపెన్ బుక్ పరీక్షలు నిర్వహించవచ్చా? లేదా? అన్నది ఈ పైలట్ పరీక్షల ద్వారా నిర్ణయిస్తారు. ఈ పరీక్షా విధానంలో విద్యార్థులు టెక్ట్స్‌బుక్స్, స్టడీ మెటీరియల్స్, నోట్స్ చూసి జవాబులు రాసేందుకు అనుమతిస్తారు. ప్రస్తుత పరీక్షా విధానంలో విద్యార్థుల జ్ఞాపకశక్తి కీలకమైతే.. ఓపెన్ బుక్ ఎగ్జామ్‌లో విశ్లేషణా సామర్థ్యం బయటపడుతుంది. అంటే ప్రస్తుత విధానంతో పోలిస్తే ఓబీఈ అంత తేలిక కాదనే విషయం బోధపడుతుంది.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×