BigTV English

DK Shivakumar: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. హైకోర్టులో డీకేకు ఊరట

DK Shivakumar: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. హైకోర్టులో డీకేకు ఊరట

Relief to DK Shivakumar High Court rejects: కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు భారీ ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో విచారణను కొనసాగించే విషయంపై దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహరంపై డీకే శివకుమార్ విచారణను కొనసాగించాలంటూ న్యాయస్థానంలో రెండు పిటిషన్ దాఖలు అయ్యాయి.


రెండు పిటిషన్లలో ఒకటి సీబీఐ దాఖలు చేయగా..మరొకటి బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ దాఖలు చేశారు. అయితే, తాజాగా, వీటిని పరిశీలించిన ధర్మాసనం విచారణను కొనసాగించేందుకు వీలు లేదంటూ రెండు పిటిషన్లను కొట్టివేసింది. దీంతో డిప్యూటీ సీఎంకు కోర్టులో ఊరట లభించినట్లయింది.

హైకోర్టు తీర్పు అనంతరం డీకే శివకుమార్ స్పందించారు. అక్రమాస్తుల కేసులో కోర్టు నిర్ణయాన్ని దేవుడి నిర్ణయంగా భావిస్తున్నానని, నేను కోర్టు తీర్పు, దేవుడిని నమ్ముతానన్నారు.


ఇదిలా ఉండగా, 2013-18 మధ్య అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డీకే శివకుమార్ మంత్రిగా వ్యవహరించారు. ఈ సమయంలో ఆయన సంపాదనలో రూ.74కోట్లు లెక్కకు మంచిన ఆదాయం ఉందని ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఆయన నివాసం, ఆఫీసుల్లో ఐటీ శాఖ సోదాలు జరిపి కొంత మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. అనంతరం ఈ వ్యవహారంలో ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు చేపట్టింది. ఈడీ విచారణ ఆధారంగా సీబీఐ ఆయనపై 2020లో కేసు నమోదు చేసింది.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×