BigTV English

vaccine drive by UNO: పోలియో వ్యాక్సినేషన్ కోసం ఏకంగా తాత్కాలికంగా యుద్ధం ఆపేసిన దేశాలు

vaccine drive by UNO: పోలియో వ్యాక్సినేషన్ కోసం ఏకంగా తాత్కాలికంగా యుద్ధం ఆపేసిన దేశాలు

Israel and  Gaza agrees to pauses in fighting for polio vaccine drive by UNO: ఇజ్రాయెల్..హమాస్ మధ్య పది నెలలుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. కాల్పుల విరమణ, యుద్ధ ఖైదీల విడుదల వంటి అంశాలపై చర్చలు జరిగినా ఆ చర్చలు విఫలం కావడంతో యుద్ధం కొనసాగుతునే ఉంది. అయితే ఇజ్రాయెల్..హమాస్ మధ్యవర్తులుగా ఖతార్, అమెరికా ,ఈజిప్ట్ బృందాలు ఉన్నాయి. ఇరు దేశాల మధ్య సామరస్య పూర్వక వాతావరణ ఉండేందుకు ఈ దేశాలు కృషి చేస్తున్నాయి. అయితే అనూహ్య పరిణామాల మధ్య ఈ ఇరుదేశాలు యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ఇచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ పుణ్యమా అని ఇరు దేశాలూ దాడులు, యుధ్దానికి బ్రేక్ ఇచ్చాయి. గత పదినెలలుగా రసాయనాలతో కూడిన ఆయుధాలతో జరుపుతున్న దాడులకు మళ్లీ గాజాలో పోలియో మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా నెలలు నిండని చిన్నారులపై ఈ దుష్ప్రభావం కనిపిస్తోంది. దీనితో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇరు దేశాల నేతలతో చర్చించింది.


ఇరు దేశాల హామీ

పోలియో వ్యాక్సినేషన్ కు సహకరించాల్సిందిగా కోరింది. అయితే పోలియో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్న ప్రాంతాలలో యుద్ధాన్ని ఆపేస్తామని ఇరు దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు హామీ ని ఇచ్చాయి. వ్యాక్సినేషన్ ఏ ఏ ప్రాంతాలలో వేస్తున్నారో అందుకు సంబంధించిన మ్యాప్ వివరాలు ఇవ్వాల్సిందిగా ఇరు దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరాయి. దాదాపు గాజా దేశం మొత్తంగా విడతల వారీగా పోలియో వ్యాక్సినేషన్ కింద టీకాలు సమకూరుస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.


Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×