E-Paper
Advertisement

వంటింటి కోసం బెస్ట్ ఫ్రిజ్ ఏది? ఎల్జీ, శాంసంగ్ మోడల్స్ మధ్య తేడాలు!

వంటింటి కోసం బెస్ట్ ఫ్రిజ్ ఏది? ఎల్జీ, శాంసంగ్ మోడల్స్ మధ్య తేడాలు!
Advertisement

LG vs Samsung Refrigerator: కొత్త ఫ్రిజ్ కొనడం.. అనేది ఇంటి  కోసం పెట్టుబడి. ముఖ్యంగా మార్కెట్లో.. ఎల్‌జీ, శాంసంగ్ వంటి దిగ్గజ బ్రాండ్లు ఉన్నప్పుడు.. ఏది ఎంచుకోవాలో అర్థం కాక చాలా మంది తికమకపడతారు. ఈ ఏడాది లేటెస్ట్ ఫీచర్లతో.. వస్తున్న ఈ రెండు బ్రాండ్ల ఫ్రాస్ట్-ఫ్రీ ఫ్రిజ్‌లు టెక్నాలజీ పరంగా అద్భుతంగా ఉంటాయి. మరి వీటిలో.. మీ అవసరాలకు, బడ్జెట్‌కు సరిపోయే.. బెస్ట్ ఆప్షన్ ఏది? వీటి ఫీచర్లు, కూలింగ్ టెక్నాలజీ వంటి వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం.

రెండిట్లో ఏది బెస్ట్ ?

కూలింగ్ టెక్నాలజీ:

కూలింగ్ విషయానికి వస్తే..ఎల్జి ఫ్రిజ్‌లు ‘DoorCooling+’ టెక్నాలజీతో వస్తాయి. ఇది ఫ్రిజ్ డోర్.. వైపు ఉండే బాటిల్స్, ఆహార పదార్థాలను కూడా వేగంగా కూల్ చేస్తుంది. మరో వైపు, శాంసంగ్ ఫ్రిజ్‌లు ‘Twin Cooling Plus’ టెక్నాలజీని కలిగి ఉంటాయి. ఇది ఫ్రిజ్, ఫ్రీజర్ భాగాలకు వేర్వేరుగా గాలిని అందిస్తుంది. దీని వల్ల కూరగాయల వాసనలు ఐస్‌ క్రీమ్‌లు లేదా ఇతర పదార్థాలకు అంటకుండా ఉంటాయి. మీరు నాన్-వెజ్ లేదా ఎక్కువ రకాల ఆహార పదార్థాలు నిల్వ ఉంచితే.. శాంసంగ్ పద్ధతి చాలా బాగుంటుంది.

స్మార్ట్ ఫీచర్లు :

Advertisement

ఈ రెండు బ్రాండ్లు కూడా.. కరెంట్ బిల్లులను తగ్గించే ఇన్వర్టర్ కంప్రెషర్లతో వస్తున్నాయి.ఎల్జీ ఫ్రిజ్‌లలోని ‘Smart Diagnosis’ ఫీచర్ వల్ల ఏమైనా సమస్య వస్తే.. మనమే ఈజీగా గుర్తించవచ్చు. అలాగే.. శాంసంగ్ మోడల్స్ ‘AI Energy Mode’తో వచ్చి కరెంట్ ఖర్చుతో మరింతగా నియంత్రిస్తాయి. వైఫై కనెక్టివిటీ , స్మార్ట్ హోమ్ ఇంటి గ్రేషన్ కోరుకునే వారికి శాంసంగ్ ఫీచర్లు మరింత అడ్వాన్స్‌డ్‌గా అనిపిస్తాయి.

డిజైన్,లుక్:

కిచెన్‌కు మోడర్న్ లుక్ తేవడంలో.. 2 కంపెనీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. ఎల్జీ… ఇన్‌ స్టా-వ్యూ టెక్నాలజీతో డోర్ తడితే.. లోపల ఏముందో చూసే అవకాశాన్ని ఇస్తోంది. అలాగే శాంసంగ్ వివిధ రంగులు, ప్రీమియం ఫినిషింగ్‌తో.. లభించే బెస్‌ పోక్ డిజైన్లను ఆఫర్ చేస్తోంది.

Advertisement

Also Read: రూ.799కే మెటాలిక్ లుక్..మార్కెట్‌ను షేక్ చేస్తున్న కొత్త ఇయర్‌ బడ్స్!

సర్వీస్ :

ప్రస్తుతం ఈ రెండు బ్రాండ్ల సర్వీస్ నెట్‌ వర్క్ చాలా ఎక్కువగా ఉంది. అయితే.. చిన్న పట్టణాల్లో కూడా ఎల్‌జీ సర్వీస్ కాస్త వేగంగా అందుబాటులో ఉంటుందని కస్టమర్లు భావిస్తుంటారు. సాధారణంగా.. రెండు బ్రాండ్ల కంప్రెషర్లపై ఎక్కువ రోజులు వారంటీ లభిస్తుంది కాబట్టి సర్వీస్ గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.

ఏది కొనాలి?
ఎల్జీ : మీకు మంచి క్వాలిటీ, ఫాస్ట్ కూలింగ్, ఈజీ సర్వీస్ , కరెంట్ ఆదా చేసే బెస్ట్ 5-స్టార్ మోడల్స్ కావాలంటే ఎల్జీ మంచి ఛాయిస్.

శాంసంగ్ : మీరు లేటెస్ట్ టెక్నాలజీ, స్మార్ట్ హోమ్ ఫీచర్లు, విభిన్న కన్వర్టబుల్ మోడ్స్ , ట్రెండీ కిచెన్ లుక్ కోరుకుంటే శాంసంగ్ బెస్ట్.

మీ బడ్జెట్.. ఇంట్లోని సభ్యుల అవసరాలను బట్టి సరైన కెపాసిటీని ఎంచుకోవడం ద్వారా మీ వంటింటికి తగిన బెస్ట్ ఫ్రిజ్‌ని సొంతం చేసుకోవచ్చు!

Related News

యాపిల్ బిగ్ లీక్.. ఫోల్డబుల్ ఐఫోన్, ఓఎల్ఈడీ మ్యాక్‌బుక్ సహా రాబోతున్న కొత్త డివైజ్‌లివే!

రూ.799కే మెటాలిక్ లుక్..మార్కెట్‌ను షేక్ చేస్తున్న కొత్త ఇయర్‌ బడ్స్!

Realme 17 Pro Plus లీక్డ్ ఫీచర్లు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే.. లాంచ్ ఎప్పుడంటే?

టైపింగ్ మాత్రమే కాదు..మీ ఫోన్ కీబోర్డ్ చేసే అద్భుతమైన పనులు ఇవే!

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.789కే.. బ్లెండ్‌జెట్ పోర్టబుల్ జ్యూసర్

‘ఐస్ బ్యాటరీ’ వింత.. రాత్రి నీరు గడ్డకట్టిస్తారు.. పగలు భవనాన్ని చల్లబరుస్తారు..!

ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్..రూ.799కే ఇయర్‌బడ్స్

Big Stories

Advertisement
×