Doctor Obscene Videos | వృత్తి రీత్యా వైద్యుడైన ఒక వ్యక్తి తన భార్యను వేరే ఇంట్లో పెట్టి.. తన అధికారిక గృహంలో మహిళ వేషం వేసుకొని అలాంటి వీడియోలు షూట్ చేసి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేవాడు. అయితే ఒక రోజు అతని భార్య ఆ వీడియోలు చూసి మహిళ వేషంలో ఉన్నది తన భర్త అని.. అది తన ఇల్లేనని గుర్తుపట్టింది. ఆ వీడియోలు బాగా వైరల్ కావడంతో ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో అంతా రచ్చ రచ్చ అయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
ఉత్తర ప్రదేశ్‌లోని సంత్ కబీర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ వరుణేష్ దుబే సమాజంలో మంచి పేరు, గౌరవం ఉన్న వ్యక్తి. అయితే ఇప్పుడు ఒక్కసారిగా అతని జీవితం రచ్చకెక్కింది. సోషల్ మీడియాలో అతని షాకింగ్ ఫొటోలు వైరల్ అయ్యాయి. అంతేకాదు, అతని భార్య సింపీ పాండే చేసిన సంచలన ఆరోపణలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
సింపీ పాండే తన భర్త గురించి షాకింగ్ విషయాలు చెప్పింది. డాక్టర్ వరుణేష్ మహిళల బట్టలు వేసుకుని మగవాళ్లతో అసభ్య వీడియోల్లో నటిస్తున్నాడని, ఆ వీడియోలను విక్రయించి డబ్బు సంపాదిస్తున్నాడని ఆమె ఆరోపించింది. “నా భర్త నన్ను గోరఖ్‌పూర్‌లో వదిలేసి, ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఉంటూ అసాంఘిక పనులు చేస్తున్నాడు. ఆ వీడియోలు ఇంటర్నెట్‌లో ఉన్నాయి, చూడండి. నేను ఈ విషయం గురించి అడిగితే, నన్నూ, నా సోదరుడ్ని చిత్రహింసలు చేశాడు” అని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కానీ, డాక్టర్ వరుణేష్ ఈ ఆరోపణలను తిరస్కరించాడు. “నా భార్య సింపీ నా ఆస్తిని కొట్టేయాలని కుట్ర చేస్తోంది. నా వృద్ధుడైన తండ్రిని మానసికంగా హింసించి చంపేసింది. ఆస్తిని తన పేరు మీద రాయాలని గొడవలు చేస్తోంది. మా బిడ్డను చంపేస్తానని కూడా బెదిరించింది. నా మీద, నా సోదరి మీద రౌడీలతో దాడి చేయించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు నకిలీవి. నా ఫోన్‌ను హ్యాక్ చేసి ఆమె డీప్‌ఫేక్ వీడియోలు తయారు చేసింది” అని అతను కౌంటర్ ఆరోపణలు చేశాడు. “నేను అమాయకుడిని, నా నిజాయితీని నిరూపించుకునే వరకు పోరాడతాను” అని అతను చెప్పాడు.
ఈ భార్యాభర్తల గొడవ పోలీసుల వరకు వెళ్లింది. ఇద్దరి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వీరిది ప్రేమ వివాహం! ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట, ఇప్పుడు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ గొడవలో నిజం ఏమిటో తెలియాలంటే, పోలీసు దర్యాప్తు ఫలితాల కోసం ఎదురుచూడాల్సిందే.