Manchu Manoj:సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోలు, హీరోయిన్లు ఏ విషయంలో కాంప్రమైజ్ అయినా ఫిట్నెస్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వరనే చెప్పాలి. అందంగా కనిపించడానికి ఏదేదో చేస్తూ ఉంటారు. అందుకే వయసు పెరిగినా ఇంకా చిన్న పిల్లల్లాగే కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక హీరో తన ఏజ్ గురించి చెప్పి అటు యాంకర్నే కాదు ఇటు జనాల్ని కూడా పిచ్చోళ్ళని చేశారు. ఆయన ఎవరో కాదు మంచు మనోజ్ (Manchu Manoj). దాదాపు 9 ఏళ్ల తర్వాత ప్రముఖ డైరెక్టర్ విజయ్ కనకమేడల(Vijay Kanakamedala దర్శకత్వంలో మంచు మనోజ్ ‘భైరవం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో నారా రోహిత్ (Nara Rohit) తో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) హీరోలుగా నటిస్తున్నారు. వీరికి జోడిగా ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar ) కూతురు అదితి శంకర్(Aditi Shankar) ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. ఈమెతో పాటు ఆనంది (Anandi), దివ్యా పిళ్ళై(Divya pillai) హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తన వయసు 29 ఏళ్ళని యాంకర్ ను బురిడీ కొట్టించిన మనోజ్..
ఇకపోతే మే30వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు మనోజ్. ఈ ప్రమోషన్ ఇంటర్వ్యూలలో తన ఫ్యామిలీ గొడవల గురించి , తన ఫేమస్ తిట్టు గురించి అలాగే తన వయసు గురించి సరదాగా అబద్ధం చెప్పి యాంకర్ ని కూడా బురిడీ కొట్టించారు మనోజ్. ఇలా పలు విషయాలపై మాట్లాడుతూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ముఖ్యంగా ఈ తొమ్మిదేళ్ల గ్యాప్ ను కవర్ చేయడానికి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ భారీగా పాపులారిటీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) చిన్న కొడుకుగా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టారు మంచు మనోజ్. సీనియర్ ఎన్టీఆర్ (Sr.NTR)ప్రధాన పాత్రలో మోహన్ బాబు హీరోగా,నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’. ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచు మనోజ్ నటించారు. ఆ తర్వాత 2004లో ‘దొంగ దొంగది’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఈ ఏడాది ఆగస్టు కి హీరోగా 21 ఏళ్ల కెరియర్ను ఇండస్ట్రీలో పూర్తి చేసుకోబోతున్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో తన వయసు 29 సంవత్సరాలు అని చెప్పడం నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది.
ALSO READ:Kollywood: ట్రాన్స్ జెండర్ గా మారిన స్టార్ హీరో.. ఇదెక్కడి విడ్డూరం భయ్యా..!
యాంకర్ పై ట్రోల్స్.. నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్..
తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మీ ఏజ్ ఎంత అని యాంకర్ ప్రశ్నించగా.. “మొన్ననే 29 వచ్చిందండీ” అని మనోజ్ సమాధానం చెప్పాడు. చాలా కాన్ఫిడెంట్గా చెప్పడంతో యాంకర్ కూడా నమ్మేశారు. నిజమని నమ్మి “30 ఏళ్లకే అన్ని అనుభవాలు చూసేశారుగా” అని అనగా.. అవునండీ అంటూ నవ్వుతూ తలూపాడు మనోజ్. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. 1983 మే 20న జన్మించారు మనోజ్. అంటే ఆయన ప్రస్తుత వయసు 42 సంవత్సరాలు. నాలుగు రోజుల క్రితమే తన బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విషయం గ్రహించని సదరు సీనియర్ యాంకర్ మనోజ్ చెప్పింది నమ్మి మోసపోయారు. ఏకంగా 13 ఏళ్ల తగ్గించి చెప్పి మరీ ఫూల్ చేశాడు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ క్లిప్స్ కూడా ఇప్పుడు నెటిజన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జనాల్ని పిచ్చోళ్లను చేసావు కదా మనోజ్ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది ఆయన చెబితే అలా ఎలా నమ్ముతారు సార్.. మీరైనా కాస్త గమనించాలిగా అంటూ యాంకర్ పై కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మనోజ్ ఆట పట్టించిన తీరుకి అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">