Pawan Vs Jagan: టాలీవుడ్‌లో అసలేం జరుగుతోంది? హరిహర వీరమల్లు సినిమా విషయంలో ఏం జరుగుతోంది. పవన్ కల్యాణ్‌ను ఎదుర్కొనేందుకు ఫిల్మ్ ఇండస్ట్రీని నుంచి జగన్ స్కెచ్ వేశారా? తుపాను రేపిన వారిలో ఇద్దరు ప్రొడ్యూసర్లు వైసీపీ అధినేతకు బాగా క్లోజని సమాచారం. ఈ విషయం పవన్ దృష్టికి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ నేరుగా లెటర్ రాయడం, ఆ వ్యక్తికి గుచ్చుకున్నట్లు వార్తలు లేకపోలేదు. ఇంతకీ ఎవరా వ్యక్తి అనేది ఇక్కడ కీలకంగా మారింది.
జూన్ ఒకటి నుంచి ఏపీలో థియేటర్లు బంద్ వ్యవహారానికి నలుగురు ప్రొడ్యూసర్లు ఉన్నారని ప్రచారం సాగింది. కాకపోతే దీనికి ఇద్దరు ప్రొడ్యూసర్లు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. వారు మిగతావారిని రెచ్చగొట్టి ‘హరిహర వీరమల్లు’ విడుదలకు ముందు అలజడి రేపాలని భావించారట. తెర వెనుక జరుగుతున్న పరిణామాలను గమనించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైలెంట్ అయ్యారు. సరే.. ఎంతవరకు వస్తుందో చూద్దామని వెయిట్ చేసేందుకు సిద్ధమయ్యారు. రోజు రోజుకూ థియేటర్ల వ్యవహారం జఠిలం కావడంతో డిప్యూటీ సీఎం కార్యాలయం ఓ లేఖ విడుదల చేసింది.
టాలీవుడ్‌లో రాజకీయాలు ఓ రేంజలో ఉంటాయని చెబుతుంటారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా సరేనంటూ పైకి చెప్పడం నార్మల్. కానీ తెర వెనుక కనిపించని రాజకీయాలు చేస్తుంటారని కొందరు చెబుతున్నారు. అటు ఇటు ఉండేవారు ఇద్దరు ప్రొడ్యూసర్లు ఉన్నారట. ట్రెండ్‌కు తగ్గట్టుగా మారిపోతుంటారని సమాచారం. థియేటర్లు బంద్ చేయాలన్న వెనుక కీలక నిర్ణయం వారిదే కీలక నిర్ణయమని అంటున్నారు.
ఎగ్జిబిటర్స్‌కు ఫోన్ చేసి షేరింగ్ నిష్పత్తిలో వాటా డిమాండ్ చేయాలని కోరాడట. ఆ ఇద్దరు మిగతావారిని రెచ్చిగొట్టి అలజడి రేపాలని భావించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం నేరుగా పవన్‌కల్యాణ్ దృష్టికి వెళ్లింది. దీనిపై అగ్గి మీద గుగ్గిలమైన పవన్, నేరుగా క్యాంప్ ఆఫీసు నుంచి లెటర్ విడుదల చేశారు. ఆ లెటర్ తగలాల్సినవారికి తగిలిందని ఇండస్ట్రీలో కొందరు చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనేది ఇండస్ట్రీలో చాలామంది పెద్దలకు తెలుసని అంటున్నారు.
ALSO READ: ఏపీలో భూమి లేకున్నా పాస్ బుక్, సరికొత్త స్కీమ్ మీ కోసమే
ఆ ఇద్దరు ప్రొడ్యూసర్లలో ఒకరు జగన్‌కు బాగా సన్నిహితుడని సమాచారం. ఆ వ్యక్తి వెనుక పొలిటికల్ అజెండా ఉందనే చర్చ లేక పోలేదు. ఆ పవన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆ వ్యక్తి ద్వారా జగన్ రాజకీయం చేయించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ వ్యక్తి ఎవరనేది పవన్ అభిమానులకు సైతం తెలిసిందని సమాచారం. దీనికితోడు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో లిక్కర్ అరెస్టుల వ్యవహారంపై రోజుకో కొత్త కథనాలు వస్తున్నాయి. ఆపై అరెస్టులు సైతం జరుగుతున్నాయి.
ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలంటే ఇదే సరైన పద్దతి అని భావించి, ఈ విధంగా స్కెచ్ వేశారని అంటున్నారు. ఈ అలజడి వెనుక ఎవరున్నారు అనేదానిపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విచారణకు ఆదేశించడం వెనుక అదే కారణమని అంటున్నారు. రేపటి రోజున దీనిపై ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.