BigTV English

Budget 2024: ‘వైద్య పరికరాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచండి’.. కేంద్రాన్ని కోరిన దేశీయ కంపెనీలు

Budget 2024: ‘వైద్య పరికరాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచండి’.. కేంద్రాన్ని కోరిన దేశీయ కంపెనీలు

Budget 2024: భారత దేశంలో వైద్య పరికరాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ పన్నులు రెండింతలకు పెంచాలని భారత వైద్య పరికరాల కంపెనీల సంఘం (అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ- AiMeD) కోరింది. భారత కంపెనీల సంఘం సభ్యలు ఈ విషయంలో కొన్ని రోజుల క్రితమే కేంద్ర మంత్రులను కలిసి తమ విన్నపాన్ని వ్రాత పూర్వకంగా సమర్పించారు. రాబోయే బడ్జెట్ లో విదేశాల నుంచి వైద్య పరికరాల దిగుమతిపై పన్నులు పెంచాలని వారు కోరారు.


ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య శాక మంత్రి జెపి నడ్డా, ఆరోగ్య శాఖ సెక్రటరీ అపూర్వ చంద్ర, ఫార్మసీ డిపార్ట్ మెంట్ సెక్రటరీ అరునిష్ చావ్లాతో భారత వైద్య పరికరాల కంపెనీల సంఘం సభ్యులు వారం రోజుల క్రితమే సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విదేశీ వైద్యపరికరాలపై ప్రస్తుతం ఉన్న 7.5 శాతం కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి పెంచాలని కోరారు. దీనివల్ల దేశీయ కంపెనీల పరికరాల తయారీ కంపెనీల ప్రోత్సాహం కలుగుతుందని.. దేశ ఆర్థికాభివృద్ధికి వైద్య పరికరాల రంగం తోడ్పడుతుందని అన్నారు.

”వైద్య పరికరాల కోసం విదేశాలపై ఆధారపడడం తగ్గిపోవాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. దేశంలో వినియోగించే వైద్య పరికరాలలో 70 శాతం విదేశాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నవే,” అని భారత వైద్య పరికరాల కంపెనీల సంఘం కోఆర్డినేటర్ రాజీవ్ నాథ్ అన్నారు. గత మూడు సంవత్సరాలలో భారత దేశంలో దిగుమతి చేసుకున్న వైద్య పరికరాల విలువు రూ.61 వేల కోట్లు. ఈ సంవత్సరంలో కేవలం జూన్ నెల వరకు తీసుకుంటే 8 వేల కోట్ల విలువ గల వైద్య పరికరాలు విదేశాల నుంచి భారత దేశం దిగుమతి చేసుకుంది.


Also Read| Budget 2024: చిన్న పరిశ్రమలకు బడ్జెట్ లో ఊరట లభించే అవకాశం.. కార్పోరేట్ల చెల్లింపులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు

వైద్యపరికరాల కస్టమ్స్ డ్యూటీలో హెల్త్ సెస్ విధించాలి

వైద్యపరికరాల దిగుమతులను తగ్గించడానికి కస్టమ్స్ డ్యూటీలో అయిదు శాతం హెల్త్ సెస్ విధించాలని.. ఇంతకుముందు ఈ హెల్త్ సెస్ లైమోనైట్ వైద్య పరికరాలపై విధించే వారని రాజీవ్ నాధ్ అన్నారు. ఈ హెల్త్ సెస్ ద్వారా వచ్చే ప్రభుత్వ ఆదాయాన్ని ఆయుష్ మాన్ భారత్ పథకం కోసం వినియోగించాలని సూచనలు చేశారు. ప్రభుత్వం ఇలా పన్నులు విధించడం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరగడంతో పాటు వైద్య పరికరాలు తయారు చేసే దేశీయ కంపెనీలు అభివృద్ధి చెందుతాయని.. పైగా భారత పరికరాలు విదేశాలకు ఎగుమతులు కూడా చేయవచ్చునని తెలిపారు.

వీటికి అదనంగా కేంద్ర బడ్జెట్ 2024-25లో ఆదాయపు పన్ను చట్టంలో వైద్య పరికరాల కోసం ప్రోత్సాహకాలు ప్రకటించాలని సూచించారు. దీని వల్ల ఈ రంగంలో పెట్టుబడులు పెరిగుతాయని.. వచ్చే నిధులతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరింత బలపడుతుందని అన్నారు. విదేశీ వైద్య పరికరాలపై పన్నులు పెంచడంతో పాటు.. దేశీయ వైద్య పరికరాలపై జిఎస్ టీని తొలగించాలని.. దీని వల్ల విదేశీ కంపనీలతో దేశీయ కంపెనీలు పోటీపడేందుకు సహకారం అందుతుందని వ్యాఖ్యానించారు. వీటితో పాటు విదేశాల నుంచి పాత, సెకండ్ హ్యాండ్ వైద్య పరికరాల దిగుమతులను పూర్తిగా నిలిపివేయడం చాలా ముఖ్యమని దీని వల్ల పర్యావరణం కలుషితం కాకుండా ఆపవచ్చునని ఆయన అన్నారు.

Also Read: కొత్త బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిమితి పెరుగబోతోందా?.. పాత లేదా కొత్త టాక్స్ స్లాబ్‌లో ఏది ఉచితం?

Related News

Cloud Burst: అసలు క్లౌడ్ బరస్ట్ ఏంటి..? దీనికి గల కారణాలేంటి..?

Gold In Odisha: ఒడిషాకు ‘బంగారు’ పంట.. నాలుగైదు జిల్లాల్లో బంగారం గనులు

CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్

Rahul Gandhi: ఎలక్షన్ కమిషన్‌పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు.. సీఈసీ ఫైర్

National Highway: రూ.11వేల కోట్లతో నేషనల్ హైవే.. 20 నిమిషాల్లోనే ఎయిర్ పోర్టుకు..!

Rare disease: హడలెత్తిస్తున్న అరుదైన వ్యాధి.. పాపం చిన్నారి మృతి.. బీ అలర్ట్!

Big Stories

×