BigTV English

Anti Drone System : సరిహద్దుల్లో డ్రోన్ల ఆగడాలకు చెక్ – DRDO అద్భుత ఆవిష్కరణ

Anti Drone System : సరిహద్దుల్లో డ్రోన్ల ఆగడాలకు చెక్ – DRDO అద్భుత ఆవిష్కరణ

Anti Drone System : నేటి యుద్ధభూమిలో దాడుల తీరు పూర్తిగా మారిపోయింది. గతంలోలా తుపాకులు పట్టుకున్న సైనికులు, ట్యాంపుల నుంచో లేదంటే ఫైటర్ జెట్ నుంచో కాదు.. షూ బాక్స్ పరిమాణంలో ఉన్న ఓ డ్రోన్ నుంచి ప్రమాదకర క్షిపణులు దూసుకురావచ్చు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో ఇలాంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మారుతున్న యుద్ధ స్వభావానికి డ్రోన్ల దాడులు మంచి ఉదాహరణ. ఈ ముప్పు ఇప్పుడు ప్రపంచ దేశాల్ని ఆలోచనలో పడేసింది. అనుకోని ముప్పుల నుంచి ఉగ్రవాదం వరకు, నిఘా, అక్రమ రవాణా వరకు డ్రోన్లను అసాంఘిక శక్తులు సైతం పెద్ద ఎత్తున వినియోగించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా.. విశాలమైన సరిహద్దులు, చట్టుపక్కల పొంచి ఉన్న శత్రువులు భారత్ కు నిరంతరం సవాళ్లు విసురుతున్నరు. ఈ తరుణంలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO).. శక్తివంతమైన D4 యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఆవిష్కరించింది. అంటే.. డ్రోన్ డిటెక్ట్, డిటర్, డిస్ట్రాయ్ అనే దశల్లో ఈ వ్యవస్థ పని చేయనుంది.


ఈ స్వదేశీ, ఇంటిగ్రేటెడ్ కౌంటర్-డ్రోన్ సొల్యూషన్ రోగ్ అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ (UAVలు)ను ఖచ్చితత్వంతో గుర్తించి, నిలుపుదల చేసేందుకు రూపొందించారు. D4 వ్యవస్థ తయారీ వెనుకున్న ఉద్దేశ్యం, ఈ వ్యవస్థ భారత్ కు ఎందుకు ముఖ్యమైనది, అది ఎలా పనిచేస్తుంది, మానవరహిత ముప్పులకు వ్యతిరేకంగా భారత్ ఎలాంటి వ్యూహాల్ని సిద్దం చేస్తుందో.. ఈ ప్రాజెక్టు ద్వారా స్పష్టం చేసింది.

డ్రోన్ల తక్కువ ధరకు లభిస్తుంటాయి. అందుకే.. ఉగ్రవాదులు, తిరుగుబాటు గ్రూపులకు డ్రోన్లను వినియోగించుకుంటున్నాయి. పంజాబ్ సరిహద్దు మీదుగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా నుంచి జమ్మూకాశ్మీర్‌లో ఆయుధాలను జారవిడవడం వరకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. అలాగే.. 2021 జమ్మూ వైమానిక స్టేషన్ పై ఓ డ్రోన్ దాడి చేసింది. ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో రెండు చిన్న డ్రోన్లు స్టేషన్ ఆవరణలో పేలుడు పదార్థాలను జారవిడిచాయి. వాటి పరిమాణం చిన్నగా ఉండడంతో.. వాటిని రాడార్ ద్వారా గుర్తించడమూ కష్టమే అవుతుంది. దాంతో.. అవి సులువుగా మన స్థావారానికి చేరుకుని.. బాంబు దాడులు చేశాయి.


D4 వ్యవస్థ ఆవిర్భావం

ఈ ముప్పుల్ని ఓ కంట కనిపేడుతున్న భారత్.. అందుకు విరుగుడుగా స్వదేశీ కౌంటర్-డ్రోన్ పరిష్కారాన్ని డీఆర్డీఓ అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది. D4 వ్యవస్థను ప్రైవేట్, ప్రభుత్వ రంగ భాగస్వాముల సహకారంతో నిర్మించారు.ఈ ప్రాజెక్ట్ బహుళ-స్థాయిలుగా ఉంది. వాటిలో.. రేడియో-ఫ్రీక్వెన్సీ (RF) గుర్తింపు, రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్, AI- ఆధారిత ముప్పు వర్గీకరణ, ఎలక్ట్రానిక్ జామింగ్, స్పూఫింగ్, హార్డ్-కిల్ – సాఫ్ట్-కిల్ న్యూట్రలైజేషన్

D4 ని ప్రత్యేకత ఏంటి?

యాండీ డ్రోన్ వ్యవస్థ అయిన D4.. అనేక సెన్సార్ల సమాహారంగా పని చేస్తుంది. ఇది తక్కువ ఎత్తులో ఎగురుతున్న చిన్న డ్రోన్‌లను గుర్తించగలదు, ట్రాక్ చేయగలదు, అనుకుంటే వాటిని తటస్థీకరిస్తుంది. అంటే.. ఎగరకుండా.. దానిని నాశనం చేయకుండా నేలమీదకు దించగలదు. అలాగే.. ఇందులోని ఎంబెడెడ్ AI ఇంజిన్ సిగ్నల్‌లను ప్రాసెస్ చేస్తుంది. అంటే.. పక్షులు, గాలిపటాలు, డ్రోన్‌ల మధ్య తేడాను గుర్తించి.. డ్రోన్ అయితే హెచ్చరిక చేస్తుంది. డ్రోన్ శత్రువని నిర్ధారించిన తర్వాత, D4 దాని ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ (EW) సూట్‌ను యాక్టివేట్ చేసి దానిని నియంత్రణలోకి తీసుకోగలదు.

డ్రోన్‌ను తప్పుదారి పట్టించడానికి GPS స్పూఫింగ్ చేసే అవకాశమూ ఈ డ్రోన్ల ప్రత్యేకత. పైలట్, డ్రోన్ మధ్య కమాండ్ లింక్‌ను తెంచుకోవడానికి RF జామింగ్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత దశలో హార్డ్-కిల్ పద్ధతిలోనూ డ్రోన్ ను నిలువరించవచ్చు. కీలకమైన భాగాలను కరిగించే లేజర్ సాయంతో శక్తివంతమైన ఆయుధాలు (DEW)లను ప్రయోగించవచ్చు. అలాగే.. యాంటీ డ్రోన్ వ్యవస్థలోని డ్రోన్లు.. ప్రత్యర్థి డ్రోన్లను ఢీకొని వాటిని నాశనం చేయొచ్చు.

ట్రయల్ గ్రౌండ్స్ నుంచి ఫ్రంట్‌లైన్స్ వరకు

2024లో మల్టిపుల్ టెస్ట్ సైకిల్స్ తర్వాత D4 వ్యవస్థ పనిచేస్తున్నట్లుగా పరిశోధకులు గుర్తించారు. ఈ డ్రోన్లను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత సైన్యం ఎంపిక చేసిన ప్రదేశాలలో వినియోగించనుంది. ముఖ్యంగా పంజాబ్, జమ్మూ, ఈశాన్య ప్రాంతాలలో ఈ వ్యవస్థను మోపరించనున్నారు. అలాగే.. చోరబాట్లకు అవకాశం ఉన్నచోట్ల, మందుగుండు సామగ్రి డంప్‌లు, వైమానిక స్థావరాలు, కమ్యూనికేషన్ హబ్‌లు వంటి వ్యూహాత్మక ప్రదేశాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. అలాగే.. పాక్, బంగ్లా వంటి దేశల సరిహద్దుల్లో అక్రమ రవాణాను గుర్తించేందుకు, BSF, CRPF వంటి దశాలు వినియోగించనున్నాయి. అలాగే.. NSG దళాలు కూడా ఈ వ్యవస్థను ఉపయోగించేందుకు శిక్షణ పొందుతోంది. ఈ వ్యవస్థ సరిహద్దుల్లో పూర్తిస్థాయిలో మోహరిస్తే.. మాదకద్రవ్యాల వ్యతిరేక & ఉగ్రవాద వ్యతిరేక చర్యలలో గేమ్‌ఛేంజర్ అవుతుందని చెబుతున్నారు.

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×