Big Stories

Drugs Sized: గుజరాత్ తీరంలో రూ.602 కోట్లు డ్రగ్స్ సీజ్.. 14 మంది పాకిస్థానీయులు అరెస్ట్..

Drugs Sized: గుజరాత్‌ తీరంలో 14 మంది పాకిస్తాన్ పౌరులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.602 కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి భద్రతా దళాలు వారిని అరెస్ట్ చేశాయి.

- Advertisement -

గుజరాత్ తీరంలో యాంటీ టెర్రరస్ట్ స్క్వాడ్(ఏటిఎస్), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సిబి)లు సంయుక్తంగా ఆదివారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా పాకిస్తాన్ కు చెందిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 86 కిలోల నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.602 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

- Advertisement -

గుజరాత్, రాజస్థాన్లలో మియావ్ మియావ్ అని పిలుపబడే నిషేధిత డ్రగ్ మెఫెడ్రోన్ ను వారు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో వారిని ఏటీఎస్, ఎన్సిబి సిబ్బంది అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. పాకిస్థానీలు స్ట్రింగ్ ఆపరేషన్ జరిగే సమయంలో వారి నుంచి తప్పించుకునేందుకు ఏటిఎస్ అధికారులపై తమ పడవను నడపడానికి ప్రయత్నించారు. దీంతో ఏటీఎస్ సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు.

Also Read: Actor Sahil Khan arrest: అడ్డంగా దొరికిపోయిన నటుడు, ఎందుకు?

దీంతో పాకిస్థాన్ డ్రగ్ స్మగ్లర్స్‌ను ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భద్రతా సంస్థలు గత రెండు రోజులుగా అంతర్జాతీయ సముద్ర సరిహద్దు సమీపంలో భారత ప్రాదేశిక జలాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా పాకిస్థానీయులను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News