Big Stories

Actor Sahil Khan arrest: అడ్డంగా దొరికిపోయిన నటుడు, ఎందుకు?

Actor Sahil Khan arrest: మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు జోరందుకుంది. ఈ కేసులో భాగంగా బాలీవుడ్ నటుడు, ఫిట్‌నెస్ ఇన్‌ప్లూయెన్సర్ సాహిల్‌ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని చత్తీస్‌గడ్‌లో అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందు సాహిల్ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్‌పై ఆయన వేసిన పిటీషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ క్రమంలో సాహిల్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.

- Advertisement -

ఇంకా ఈ కేసు లోతుల్లోకి వెళ్తే.. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా 15 వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నది ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా 67 బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లను క్రియేట్ చేసి క్రికెట్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి ఆటల పేరిట గ్యాంబ్లింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో సామాన్యులను ఆకట్టుకునేందుకు సెలబ్రిటీలతో ప్రమోట్ చేయించారు. ఈ వ్యవహారాన్ని పసిగట్టిన సామాజిక కార్యకర్త ప్రకాశ్ బంకర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

ఈ గేమ్‌ను ప్రమోట్ చేసినవారిలో సాహిల్‌ఖాన్ కూడా ఒకడు. కాకపోతే ఆయన మహాదేవ్ బెట్టింగ్ యాప్‌కు కో -ఫౌండర్ అన్న వాదన లేకపోలేదు. అయితే ఆ యాప్‌తో తనకు సంబంధం లేదని, తాను ప్రమోట్ చేశానన్నది సాహిల్ వాదన. ఈ కేసు వ్యవహారంలో పలుమార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినా తప్పించు కుంటూ తిరిగాడు. ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు. బెట్టింగ్ యాప్ ద్వారా వేల కోట్ల రూపాయలను హవాలా ద్వారా విదేశాలకు తరలించినట్టు పోలీసులు గుర్తించారు.

సాహిల్‌ఖాన్‌ అరెస్టు కావడంతో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను విచారించేందుకు సిద్ధమవుతున్నారు ముంబై పోలీసులు. తక్కువ సమయంలో బాలీవుడ్‌లో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు సాహిల్‌ఖాన్. స్టయల్, ఎక్స్‌క్యూజ్‌మీ సినిమాల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దీనికితోడు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తూ సొంతంగా ఓ కంపెనీ కూడా స్థాపించాడు.

ALSO READ: ఇంకా నా వల్ల కాదు.. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ పదవికి లవ్లీ రాజీనామా..

ఈ కేసులో ప్రధాన నిందితుడు రవి ఉప్పల్‌ను గతేడాది దుబాయ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ యాప్ ప్రమోటర్లలో ఒకరు సౌరబ్‌చంద్రకర్ మ్యారేజ్ యూఏఈలో జరిగింది. ఇందుకోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వార్తలు లేకపోలేదు. దీనికి బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరైనట్లు గుర్తించారు. ఈ కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్‌కు ముడుపులు అందినట్టు గతంలో బీజేపీ నుంచి ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News