Big Stories

US Tornadoes: అమెరికాలో టోర్నడోల బీభత్సం.. అనేక ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లు

US Tornadoes: అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నెబ్రాస్కా రాష్ట్రంలో టోర్నడోల  వల్ల పెద్ద ఎత్తున ఇళ్లు దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో దుమ్ము, ధూళితో కూడిన భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. టోర్నడోలు ముందుకు కదులుతుండగా కొందరు తీసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

- Advertisement -

అనేక ప్రాంతాల్లో టోర్నడోలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. టోర్నడోల కారణంగా లింకన్ లోని ఓ పరిశ్రమ  పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాద సమయంలో సుమారు 70 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. వారిలో పలువురికి గాయలైనట్లు అధికారులు తెలిపారు. నెబ్రాస్కాలోని ఒమాహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ టోర్నడోలు వచ్చాయి. దీంతో సమీప ప్రాంతాల్లోని సుమారు 11 వేల ఇళ్లకు  విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

- Advertisement -

Also Read: కలల ప్రపంచం వోవెన్.. ఫ్యూచర్ సిటీ విశేషాలు..

అమెరికా వ్యాప్తంగా వారం రోజుల్లో 70 కి పైగా టోర్నడోలు నమోదయ్యాయని ఆ దేశ జాతీయ వాతావరణ సంస్థ తెలిపింది. అమెరికాలో టోర్నడోలు సర్వసాధారణం. కానీ మధ్య అమెరికా, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో టోర్నడోలు ఎక్కువగా వస్తుంటాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News