BigTV English

ED Case On Kerala CM Daughter: పినరయి విజయన్ కుమార్తెపై ఈడీ కేసు..

ED Case On Kerala CM Daughter: పినరయి విజయన్ కుమార్తెపై ఈడీ కేసు..
ED Case On Pinaray Vijayan  Daughter
ED Case On Pinarayi Vijayan  Daughter

ED Case On Pinarayi Vijayan  Daughter: సార్వత్రిక ఎన్నికల ముందు కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణాపై ఈడీ కేసు నమోదు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. పీఎంఎల్ఏ కింద ఈడీ ఈ కేసు నమోదు చేసింది. అలాగే ఇంకొందరిపైనా అక్రమ నగదు చలామణి చట్టం  కింద కేసులు నమోదు చేసింది.


వీణా విజయన్ చెందిన ఐటీ సంస్థకు ఓ ప్రైవేట్ కంపెనీ అక్రమంగా చెల్లింపులు చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమెపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.

కొన్ని రోజుల క్రితం కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ అంశంపై దృష్టిపెట్టింది. ఈ వ్యవహారంపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. వీణా విజయన్, ఆమె సంస్థతోపాటు ఇంకొందరిపైనా ఈడీ పీఎంఎల్ఏ కింద కేసులు నమోదు చేసింది.


Also Read: కేజ్రీవాల్ అరెస్ట్ పై అమెరికా రియాక్షన్.. భారత్ అభ్యంతరం..

కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ అనే కంపెనీ వీణా విజయన్ కు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ సంస్థకు రూ. 1.72 కోట్లు చెల్లింపులు చేసింది. 2018-19 మధ్య అక్రమంగా ఈ లావాదేవీలు జరిగాయని ఐటీ శాఖ గుర్తించింది. ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ఎలాంటి సేవలు అందించకుండానే కొచ్చిన్ మినరల్స్ ఈ నిధులు మల్లించినట్లు నిర్దారించింది.

మరోవైపు ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ పై ఎస్ఎఫ్ఐఓ విచారణ జరిపింది. ఈ రెండు సంస్థల మధ్య అక్రమ చెల్లింపులు జరిగాయని తేల్చింది. అయితే ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తునకు వ్యతిరేకంగా ఎక్సాలాజిక్ సొల్యూషన్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

Tags

Related News

Trump-Modi: 4సార్లు ట్రంప్ ఫోన్ కాల్ కట్ చేసిన మోదీ.. జర్మనీ పత్రిక సంచలన కథనం

Cloudburst: దోడాలో క్లౌడ్ బరస్ట్.. జమ్మూ ప్రాంతంలో వరదల విజృంభణ.. మళ్లీ ప్రాణనష్టం!

Discount Scheme: వాహనదారులకు ప్రభుత్వం కొత్త స్కీమ్.. ఏ మాత్రం ఆలస్యం వద్దు

PM Modi: రంగంలోకి సుదర్శన చక్ర.. ఇక శత్రువులకు చుక్కలే!

India Warning: పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇండియా.. ఈసారి వారి మంచి కోసమే, వాళ్లంతా సేఫ్!

CISF Women Commando: పురుషుల ఆధిపత్యానికి ఫుల్‌స్టాప్…. మహిళా కమాండోలు ఎంట్రీ!

Big Stories

×