BigTV English

Edible Oils: సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వంట నూనెల ధరలు!

Edible Oils: సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వంట నూనెల ధరలు!

Increase in Edible Oils: సామాన్య ప్రజలకు బిగ్ షాక్. దేశంలో వంటనూనెల ధరలు మరింత పెరిగాయి. తాజాగా, కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్, సోయా బీన్, సన్‌ఫ్లవర్ నూనెలపై 20శాతం దిగుమతి సుంకం అనగా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పామాయిల్, సోయా, సన్ ఫ్లవర్ సహా వివిధ రకాల నూనెలపై భారం పడనుంది.


ఇప్పటివరకు వీటి ముడి నూనెలపై ఎటువంటి సుంకం ఉండేది కాదు. కానీ కేంద్రం ఏకంగా రిఫైన్డ్ పామాయిల్, సోయా, సన్ ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుంచి 32.5 శాతానికి పెంచింది. దీంతో పేద, మధ్య తరగతి జేబులకు చిల్లు పడనుంది. ఇలా వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం పెంచడంతో ఆ భారం వినియోగదారులపై పడనుంది.

Also Read: త్వరలోనే హైడ్రాకు విశేషాధికారాలు.. ఆర్డినెన్స్, అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు: రంగనాథ్


ఈ నిర్ణయంతో అన్ని రకాల ఆయిల్స్ ధరలు లీటర్‌పై ఒక్కసారిగా రూ.15 నుంచి రూ.20వరకు పెరిగాయి. పామాయిల్ రూ.100 నుంచి రూ.115, సన్ ఫ్లవర్ నూనె రూ.115 నుంచి రూ.130 – రూ.140, వేరుశనగ నూనె రూ. 155 నుంచి రూ.165 వరకు చేరింది. దీంతో పాటు పూజలకు ఉపయోగించే నూనెలను రూ.110 నుంచి రూ.120 వరకు పెంచారు. ఈ ధరలతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ప్రపంచలోనే అతిపెద్ద వంట నూనెల ఎగుమతిదారుగా భారత్ ఉంది.  అయితే దేశంలో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో రైతులను ఆదుకునే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని 20శాతం పెంచినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో రైతులకు మేలు జరగనుంది. అయితే ఇంపోర్ట్ టాక్స్ పెంపు ఉంటుందని నిపుణులు చెబున్నారు.

ఈ నిర్ణయంతో సోయాబీన్ తో పాటు వివిధ పంటలను పండించిన రైతులకు కనీస మద్దతు ధర లభించనుంది. అలాగే దేశీయ సోయాబిన్ ధరలు కింటాకు రూ.4600 ఉంది. రాష్ట్ర సెట్ మద్దతు ధర రూ.4892 కంటే తక్కువగా ఉంది.

Also Read: సీతారాం ఏచూరికి అంతిమ వీడ్కోలు.. భౌతికకాయం ఆస్పత్రికి దానం

ఇక, దేశంలో కూరగాయాల నూనె వినియోగంలో దిగుమతుల వాటా 70శాతానికి పైగా ఉంది. ఇందులో అత్యధికంగా పామాయిల్ వాటా 50శాతానికిపైగా ఉంది. మిగతావి సోయా, సన్ ఫ్లవర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రధానంగా ఇండోనేసియా, మలేసియా, థాయ్ లాండ్ నుంచి పామాయిల్, అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాల నుంచి సోయా, సన్ ఫ్లవర్‌లను మనదేశం సరఫరా చేసుకుంటోంది.

వాస్తవానికి వివిధ దేశాల నుంచి నూనెలను దిగుమతి పూర్తయిన తర్వాత రిఫైనరీలకు చేరుకొని వాటిని ఫ్యాకింగ్ చేయడానికి కొంత సమయం పడుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొత్త స్టాక్ మీద మాత్రమే ధరలను సవరించాలి. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో నిల్వ ఉన్న నూనెలపై కూడా కొంతమంది వ్యాపారులు ధరలు పెంచి విక్రయిస్తున్నారు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×