– అశ్రునయనాలతో ఢిల్లీ ఎయిమ్స్‌కు అప్పగించిన ఫ్యామిలీ
– దేశంలోని అగ్ర నేతల నివాళులు
Delhi AIIMS: కమ్యూనిస్ట్ యోధుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి తుది వీడ్కోలు పలికారు కుటుంబ సభ్యులు, అభిమానులు. అంత్యక్రియలు లేని నేపథ్యంలో ఆయన భౌతికకాయాన్ని పరిశోధన, బోధన కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు దానం చేసింది ఫ్యామిలీ. రాజకీయ ప్రముఖుల నివాళుల తర్వాత పార్థివదేహాన్ని ఎయిమ్స్‌కు తరలించారు. శుక్రవారం సాయంత్రం ఎయిమ్స్ నుంచి జేఎన్‌యూకి తరలించగా, అక్కడ విద్యార్థులు నివాళులు అర్పించారు. తర్వాత కుటుంబసభ్యులు, బంధువుల సందర్శనార్థం వసంత్ కుంజ్‌లోని సీతారాం నివాసానికి తరలించారు. శనివారం ఉదయం ఆయన 3 దశాబ్దాలపాటు పని చేసిన ఏకేజీ భవన్‌కు తీసుకెళ్లారు. అక్కడ సీపీఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అలాగే, ఇతర పార్టీల నేతలు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, జైరాం రమేష్, రాజీవ్ శుక్లా, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ నివాళులర్పించారు. వీరితోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన సీపీఎం నేతలు, కేరళ, తమిళనాడు, గుజరాత్, అసోం, బిహార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన నాయకులు సీతారాం భౌతికకాయాన్ని సందర్శించి అంతిమ వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏకేజీ భవన్ నుంచి ఎయిమ్స్ వరకు అంతిమ యాత్ర కొనసాగింది. ఆయన కోరిక మేరకు పరిశోధన, బోధన కోసం ఎయిమ్స్‌కు దానం చేశారు కుటుంబసభ్యులు.
Also Read: GHMC Elections: పాడి కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా?
లాల్ సలామ్
భారత్‌లోని చైనా రాయబారి ఫెయ్‌హాంగ్ సైతం సీతారాం ఏచూరికి నివాళులు అర్పించారు. ఆయనతోపాటు మరికొందరు చైనీయులు ఆయన పార్థివదేహాన్ని సందర్శించారు. అలాగే, పాలస్తీనా, వియత్నాం దేశాల రాయబారులు కూడా నివాళులు అర్పించారు. ప్రపంచంలోని కమ్యూనిస్ట్ దేశాల్లోని నాయకులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటించారు.