E-Paper
Advertisement

Eknath Shinde | షిండే వర్గమే అసలైన శివసేన.. ఉద్ధవ్ ఠాక్రేకు బిగ్ షాక్!

Eknath Shinde | మహారాష్ట్ర రాజకీయాల్లో బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండ్ సహా 16 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వర్తించదని స్పీకర్ నార్వేకర్ ప్రకటించారు.

Eknath Shinde | షిండే వర్గమే అసలైన శివసేన.. ఉద్ధవ్ ఠాక్రేకు బిగ్ షాక్!
Advertisement

Eknath Shinde | మహారాష్ట్ర రాజకీయాల్లో బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండ్ సహా 16 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వర్తించదని స్పీకర్ నార్వేకర్ ప్రకటించారు.

చట్టపరంగానే ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారని స్పీకర్ తెలిపారు. ఏక్ నాథ్ షిండేని తొలగించే అధికారాలు ఉద్ధవ్ ఠాక్రేకి లేవని చెప్పారు. ఆ అధికారాలు శివసేన అధిష్ఠానమైన రాష్ట్రీయ కార్యకారిణికి మాత్రమే ఉన్నాయని చెప్పారు. శివసేన పార్టీ 1999 రాజ్యాంగ నిబంధనల ప్రకారమే.. శివసేన గుర్తింపు ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందుతుందని తీర్పు వెలువరించారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి పెద్ద షాక్ తగిలింది.

Advertisement

జూన్ 2022లో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏక్ నాథ్ షిండే సహా 16 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో శివసేన పార్టీ రెండు భాగాలుగా చీలిపోయింది. ఫలితంగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి(కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన సంకీర్ణ)ప్రభుత్వం కూలిపోయింది. ఆ సమయంలో ఈ 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. కానీ వీరంతా అనర్హతకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు.

ఎమ్మెల్యేలపై అనర్హత కేసులో సుప్రీం కోర్టు జనవరి 10లోపు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

Advertisement

Tags

Related News

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Big Stories

Advertisement
×