E-Paper
Advertisement

Assembly Elections 2023 : ఆ రోజున భారీగా పెళ్లిళ్లు.. ఎన్నికల షెడ్యూల్ లో మార్పులు

Assembly Elections 2023 : ఆ రోజున భారీగా పెళ్లిళ్లు.. ఎన్నికల షెడ్యూల్ లో మార్పులు
Advertisement

Assembly Elections 2023 : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ తేదీలను ప్రకటించారు. పోలింగ్ తేదీలు ప్రకటించిన రెండు రోజులకే ఒక రాష్ట్రంలో పోలింగ్ తేదీని మార్చుతూ నేడు మరో ప్రకటన చేసింది ఈసీ.

రాజస్థాన్ లో పోలింగ్ నిర్వహించే తేదీలో (Rajastan Polling Day) మార్పు జరిగింది. సోమవారం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23వ తేదీన రాజస్థాన్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఆ రోజు రాష్ట్రంలో భారీగా పెళ్లిళ్లు ఉండడంతో పోలింగ్ తేదీలో మార్పు చేసింది ఈసీ. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను నవంబర్ 25వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

రాజస్థాన్ లో నవంబర్ 23న సుమారు 50 వేలకు పైగా పెళ్లిళ్లు జరగనున్నాయట. అదేరోజు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సన్నద్ధమైంది. కానీ.. భారీగా పెళ్లిళ్లు జరగనున్న నేపథ్యంలో ఓటింగ్ శాతం తగ్గే అవకాశాలున్నాయని, పోలింగ్ తేదీని మార్చాలంటూ రాజస్థాన్ బీజేపీ ఈసీని ఆశ్రయించింది. ఓటింగ్ శాతం తగ్గుతుందన్న అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ఈసీ.. ఈ మేరకు నవంబర్ 25న పోలింగ్ చేపట్టేలా షెడ్యూల్ లో మార్పు చేసింది. డిసెంబర్ 3న యథావిధంగా కౌంటింగ్ ఉంటుందని తెలిపింది.

Related News

మురికి నదిని ఒంటరిగా శుభ్రం చేసిన పేద యువకుడు.. కట్ చేస్తే అంతర్జాతీయ కంపెనీ జాబ్ ఆఫర్

నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. ఆ నేరానికి ఇది చాలా చిన్న శిక్ష!

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

Big Stories

Advertisement
×