BigTV English

Amazon Forest : అయ్యో.. అమెజాన్!

Amazon Forest : అయ్యో.. అమెజాన్!
Amazon Forest

Amazon Forest : బ్రెజిల్‌లోని అమెజాన్ వర్షారణ్యాల పరిధిలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 5 లక్షల మంది దీని ప్రభావాన్ని చవిచూడనున్నారు. ఎల్‌నినో కారణంగా ఈ రీజియన్‌‌ను వర్షభావం కమ్మేసింది. అమెజాన్ నది నీటితో గలగలలాడుతున్నప్పుడు, ఆ తర్వాత ఎండిపోయిన పరిస్థితులకు అద్దం పట్టే ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.


అమెజాన్ ప్రధాన, అతి పెద్ద ఉపనది రియో నెగ్రోలో నీటి మట్టం 20 సెంటీమీటర్ల తగ్గపోయింది. జూలై, అక్టోబర్ నెలల్లో రియో నెగ్రో నది ఎలా ఉన్నదీ వివరిస్తూ మైక్రోబ్లాగింగ్ సంస్థ ఎక్స్-యూజర్ ఒకరు ఫొటోలను షేర్ చేశారు. వర్షాభావం కారణంగా ఆ నది ఇప్పుడు కళావిహీనమైంది. ఎల్‌నినో వల్ల వర్షపాతం సగటు కన్నా తక్కువే నమోదైంది. బ్రెజిల్‌లోని అమెజోనాస్ రాష్ట్రంలోని 62 మునిసిపాలిటీల్లో 59 మునిసిపాలిటీలు కరువుతో అల్లాడుతున్నాయి. 15 మునిసిపాలిటీల పరిస్థితి మరీ దుర్భరంగా మారింది.

అమెజాన్ రీజియన్ లో దుర్బిక్షంతో అల్లాడుతున్న ప్రాంతాల ప్రజలను ఆదుకుంటామని బ్రెజిల్ ప్రభుత్వం ప్రకటించింది. ఎల్‌నినో కారణంగా అమెజాన్ రీజియన్‌లో 2024 వరకు దుర్భిక్ష పరిస్థితులు కొనసాగచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలా నదులు ఎండిపోవడంతో పలు మత్స్యజాతులు ప్రమాదంలో పడ్డాయి. టెఫె లేక్ పరిధిలో కొన్నిరోజులుగా డాల్ఫిన్ కళేబరాలు వెలుగు చూస్తున్నాయి.


ఇలా దాదాపు 125 వరకు డాల్ఫిన్లు మరణించాయి. ఇలాంటి పరిస్థితిని ముందెన్నడూ చవిచూడలేదంటూ పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు అధిక వేడి కారణమని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 38.8 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నాయి. చనిపోయిన డాల్ఫిన్లలో 80 శాతం అరుదైన పింక్ డాల్ఫిన్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఇవి అంతరిస్తున్న జీవుల జాబితాలో ఉన్నాయి. నదులు ఇంకిపోతుండటంతో జలరవాణాకు ఆటంకం కలుగుతోంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×