Big Stories

Sheikh Shahjahan: సందేశ్‌ఖాలీ నిందితుడు షాజహాన్ అరెస్ట్..

Sandeshkhali Accused Sheikh Shahjahan Arrested By ED
Sandeshkhali Accused Sheikh Shahjahan Arrested By ED

Sandeshkhali Accused Sheikh Shahjahan Arrested By ED: భూకబ్జా కేసులో టీఎంసీ బహిష్కృత నేత షేక్ షాజహాన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అరెస్ట్ చేసింది. నిందితుడు ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. బసిర్‌హత్ జైల్లో ఉన్న షేక్‌ను ఈడీ విచారించింది. అంతకుముందు ఆయనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది.

- Advertisement -

సోమవారం, జైలు అధికారులు షేక్‌ షాజహాన్‌ను ప్రొడక్షన్ వారెంట్‌పై కోర్టులో హాజరుపరుస్తుంది. అయితే ఈడీ షేక్‌ను కోర్టు నుంచి తన రిమాండ్‌లోకి తీసుకుంటుంది. అప్పటి వరకు అతను జైల్లోనే ఉంటాడు.

- Advertisement -

గతంలో అరెస్టయిన షేక్ షాజహాన్‌పై పీఎంఎల్‌ఏ కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పలు చోట్ల దాడులు నిర్వహించింది. ఈడీ బృందంతో పాటు పెద్ద సంఖ్యలో పారామిలటరీ బలగాలు ఉన్నాయి.

ఫిబ్రవరిలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందంపై అతని మద్దతుదారులు జరిపిన దాడికి సంబంధించి పశ్చిమ బెంగాల్ పోలీసులు షాజహాన్‌ను అరెస్టు చేశారు. సందేశ్‌ఖాలీలోని ఆయన ఇంటిపై దాడి చేసేందుకు వెళ్లగా ఈడీ బృందం దాడి చేసింది.

Also Read: Sandeshkhali case: టీఎంసీ నేత షేక్ షాజహాన్ అరెస్ట్.. 10 రోజుల పోలీసు కస్టడీ..

ED బృందంపై దాడి తరువాత షాజహాన్ 55 రోజుల తప్పించుకొని తిరిగాడు. పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత, షేక్ షాజహాన్‌ను తృణమూల్ కాంగ్రెస్ ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News