Big Stories

Loksabha Elections: ప్రత్యేక రాష్ట్రం డిమాండ్.. ఎలక్షన్స్ బాయ్ కాట్ చేస్తున్న ప్రజలు.. ఎక్కడంటే?

NagalandLoksabha Elections: నాగాలాండ్ లోని ఓ వర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేస్తూ లోక్ సభ ఎన్నికలను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించింది. ఆరు జిల్లాలతో తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని.. దీనిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

నాగాలాండ్ లో ఆరు జిల్లాలతో ప్రతేక రాష్ట్రాలన్ని ఏర్పాటు చేయాలని ది ఈస్ట్రన్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక రాష్ట్రంపై కేంద్రం నుంచి స్పష్టత వచ్చేంత వరకు లోక్ సభ స్థానంలో ఎన్నికలకు సహకరించబోమని స్పష్టం చేసింది. నాగాలాండ్ తూర్పు ప్రాంతానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, వివిధ సంస్థలకు చెందిన ప్రముఖులతో చర్చించిన తర్వాతనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

- Advertisement -

నాగాలాండ్ లో ఏడు గిరిజన తెగలకు నేతృత్వం వహిస్తున్న ఈఎన్ పీవో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి వారు అడ్డంకిగా మారారు. అయితే గత కొన్నాళ్లుగా ప్రత్యేక రాష్ట్రం కోసం వారు నిరసనలు చేస్తున్నారు. దీంతో మార్చి 8వ తేదీనా కేంద్రం అక్కడ పబ్లిక్ ఎమర్జెన్సీ విధించింది. దీంతో ఈఎన్ పీవో ఎన్నికలను బహిస్కరించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గతేడాది నాగాలాండ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను కూడా ఈ జిల్లాల వారు బహిష్కరించారు. వెంటనే దిగొచ్చిన కేంద్రం.. హో మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపింది. అమిత్ షా ఇచ్చిన హామీ మేరకు వారి అప్పట్లో ఎన్నికల్లో పాల్గొన్నారు. కానీ అమిత్ షా ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో వీరు మరోసారి ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చారు.

గతంలో కేంద్ర హోంశాఖ ముగ్గురు సభ్యులతో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ముగ్గురు సభ్యులు బృందం పలుమార్లు ఆయా ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంది. తూర్పు నాగాలాండ్ ప్రాంత ప్రజల కోసం అని స్వతంత్ర వ్యవస్థను రూపొందించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సిఫారుసు లేఖను పంపిందని అక్కడి సీఎం నెఫ్యూరియో తెలిపారు.

Also Read: Sheikh Shahjahan: సందేశ్‌ఖాలీ నిందితుడు షాజహాన్ అరెస్ట్..

అయినా సరే ఈఎన్ పీవో తన నిర్ణయాన్ని మరోసారి వెనక్కి తీసుకునేది లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం అక్కడ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News