BigTV English

Eternal Bride: నిత్య పెళ్లి కూతురు..డబ్బున్న యువకులే టార్గెట్ ..

Eternal Bride: నిత్య పెళ్లి కూతురు..డబ్బున్న యువకులే టార్గెట్ ..

Eternal Bride: డబ్బు సంపాదన కోసం రషీద అనే యువతి నిత్య పెళ్ళి కూతురులా మారింది. డబ్బున్న యువకులే టార్గెట్‌గా సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తుంది.
ఇలా లవ్‌లో దింపిన యువకులను పెళ్లి చేసుకుని..కొన్ని రోజులు కాపురం కూడా చేస్తుంది. ఆ తర్వాత ఇంట్లో అందినకాడికి దోచుకుని పరారవుతుంది. ఇది చెన్నైకి చెందిన రషీద అనే యువతి ఘరానా మోసం.ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఏపీతోపాటు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 8 మందిని వివాహమాడింది ఈ మాయలేడి.


మొదటగా తమిళనాడులోని సేలం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్ మూర్తి అనే వ్యక్తిని ట్రాప్ చేసింది రషీద. అతన్ని వివాహమాడి అతని ఇంట్లో ఉన్న 1.5 లక్షల నగదు, 5 సవర్ల బంగారు నగలతో
అదృశ్యమైంది. దీంతో మూర్తి ఫిర్యాదుతో దర్యాఫ్తు మొదలు పెట్టిన పోలీసులకు రషీద బాగోతం బయటపడింది.

తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్ మూర్తికి ఇన్ స్టాలో రషీద పరిచయమైంది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఈ ఏడాది మార్చి 30న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు బాగానే గడిచినా.. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో అక్కడ నగదు, నగలతో జంప్ అయ్యింది. పోలీసుల దర్యాప్తు తర్వాత ఆమె అసలు బండారం బయటకొచ్చింది. సంపన్న యువకులే లక్ష్యంగా సోషల్ మీడియాలో వలవేసి వారితో పెళ్లి తర్వాత డబ్బులతో పరారవుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారిలో ఉన్న రషీద కోసం గాలిస్తున్నారు పోలీసులు.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×