BigTV English

FASTag card: కేంద్రం కొత్త రూల్స్.. ఫాస్టాగ్​ కార్డుతో అలా చేస్తే బుక్కయినట్టే

FASTag card: కేంద్రం కొత్త రూల్స్.. ఫాస్టాగ్​ కార్డుతో అలా చేస్తే బుక్కయినట్టే

FASTag card: ఫాస్టాగ్ స్టిక్కర్‌లను తమ వాహనంలో నిర్దేశిత ప్రాంతంలో అతికించని వాహనదారులపై కఠిన చర్యలు రెడీ అయ్యింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. వాహనానికి అతికించకుండా చేతిలో పట్టుకొని కార్డు చూపించే విధానానికి ఫుల్‌స్టాప్ పడనుంది. అలా చేస్తే అడ్డంగా బుక్కయినట్టే. NHAI మిమ్మల్ని బ్లాక్‌ లిస్ట్ చేస్తుంది.


చాలామంది వాహన యజమానులు ఫాస్టాగ్​‌లను వాహన విండ్‌షీల్డ్‌కు అతికించరు. దీనివల్ల రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని గమనించిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కఠిన చర్యలకు దిగింది. లూజ్ ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులను బ్లాక్‌లిస్ట్ చేయనుంది. ఉద్దేశపూర్వకంగా వాహనంపై ఫాస్ట్ ట్యాగ్‌ను అతికించని వారిని లూజ్ ఫాస్ట్ ట్యాగ్ అంటారు. లేకుంటే ట్యాగ్-ఇన్-హ్యాండ్ అని పిలుస్తారు.

ఈ-టోల్ వసూలు వ్యవస్థలో అంతరాయాలు, ఇతర ప్రయాణికులకు అసౌకర్యానికి కారణమవుతోందని గుర్తించింది.  లేన్ల రద్దీ, తప్పుడు ఛార్జ్‌ బ్యాక్‌ల ఉత్పత్తి, క్లోజ్డ్-లూప్ టోలింగ్ వ్యవస్థలలో దుర్వినియోగానికి దారి తీసింది. ఎలక్ట్రానిక్ టోల్ వసూలు విధానాన్ని ప్రభావితం చేసింది.దీనివల్ల జాతీయ రహదారుల్లో వినియోగదారులకు అసౌకర్యానికి గురవుతున్నారు.


జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనాల్లో 98 శాతం కంటే ఎక్కువ టోల్ ఛార్జీలు చెల్లించడానికి ఫాస్టాగ్‌ను ఉపయోగిస్తున్నాయి. ఈ వ్యవస్థ ఎలక్ట్రానిక్ టోల్ వసూలు విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. లూస్ ఫాస్టాగ్స్ లేదా ట్యాగ్-ఇన్-హ్యాండ్ ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వంటివి వాటి కార్యకలాపాల సామర్థ్యానికి సవాలుగా నిలుస్తున్నాయి.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అసలు విషయం వెల్లడించింది. కొత్తగా తీసుకున్న చర్యల వల్ల టోల్ కార్యకలాపాలను మరింత సులభతరం చేస్తుందని పేర్కొంది. వార్షిక పాస్ విధానం, మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్, రాబోయే కార్యక్రమాల దృష్ట్యా ఫాస్టాగ్ ప్రామాణికత, సిస్టమ్ విశ్వసనీయతను నిర్ధారించడానికి ఆయా సమస్యలు పరిష్కరించడం ముఖ్యమని ప్రస్తావించింది.

ఈ చర్యతో లూస్ ఫాస్టాగ్స్ గురించి టోల్ వసూలు చేసే ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు తక్షణం నివేదించడానికి అథారిటీ తన విధానాన్ని మరింత క్రమబద్ధీకరించిందని తెలిపింది.  కొంతమంది డ్రైవర్లు ఉద్దేశపూర్వకంగా ఫాస్ట్‌ట్యాగ్‌ను విండ్‌షీల్డ్‌కు అతికించరు. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. టోల్ వసూలు వ్యవస్థలో అంతరాయం ఏర్పడుతోంది.

ఈ క్రమంలో ఇతర ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. టోల్ వసూలు ప్రక్రియను సజావుగా చేయడానికి ఈ దశ అవసరమని NHAI పేర్కొంది.  జూలై 11, 2025న NHAI ఈ విధానాన్ని ప్రకటించింది. టోల్ వసూలు ఏజెన్సీలు ఇటువంటి దుశ్చర్యలను వెంటనే నివారించాలని పేర్కొంది. దీని ఆధారంగా NHAI FASTagను బ్లాక్‌లిస్ట్ చేయనుంది.

టోల్ వసూలు ఏజెన్సీలకు ప్రత్యేక ఇమెయిల్ IDని ఇచ్చింది NHAI.దీని ద్వారా అలాంటి FASTagsను వెంటనే మెయిల్ చేయవచ్చు. ఆయా FASTag ను బ్లాక్ లిస్ట్ చేయనుంది NHAI. ఆ తర్వాత ఆ కార్డు పని చేయడం ఆగిపోతుంది.

Related News

Bihar Bidi: బీహారీల బీడీ.. ఆ పోలికతో చిక్కుల్లో పడ్డ కాంగ్రెస్.. అసలే ఎన్నికల సమయం!

GST Reforms: వన్ నేషన్ – వన్ ట్యాక్స్ అందుకే సాధ్యం కాదు -నిర్మలా సీతారామన్

Mumbai High Alert: గణేష్ నిమజ్జనం సందర్భంగా బాంబు బెదిరింపు.. నగర వ్యాప్తంగా హై అలర్ట్

Russian Oil: ఈయూ దేశాలకు పెరిగిన భారత్ డీజిల్ ఎగుమతులు

Delhi-NCR Earthquake: ఆఫ్ఘాన్ ఎఫెక్ట్ ఢిల్లీని తాకింది.. మళ్లీ భూప్రకంపనల భయం

America Cool Drinks: అమెరికా కూల్ డ్రింక్స్ ఇక బంద్.. ఆ రాష్ట్రంలోని హోటళ్లు కీలక నిర్ణయం

Big Stories

×