BigTV English

Fire breaks out in two restaurants: ఢిల్లీ రెస్టారెంట్లలో ప్రమాదాలు, కాకపోతే.. ఏం జరిగింది?

Fire breaks out in two restaurants: ఢిల్లీ రెస్టారెంట్లలో ప్రమాదాలు, కాకపోతే..  ఏం జరిగింది?

Fire breaks out in two restaurants: ఢిల్లీని వరస ఘటనలు వెంటాడుతున్నాయి. కోచింగ్ సెంటర్‌లో జరిగిన ప్రమాదాన్ని మరచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఐఎన్ఏ మార్కెట్‌లో ఫాస్ట్ ఫుడ్, రెస్టారెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది.


ఢిల్లీలోని ఐఎన్ఏ మార్కెట్‌లో చైనీస్‌కు చెందిన ఫాస్ట్‌ఫుడ్ షాపు ఉంది. సోమవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో ఆ షాపు నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ తర్వాత పక్కనే ఉన్న రెస్టారెంట్‌కు మంటలు వ్యాపించాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఆ చుట్టుపక్కల వాసులు భయంతో పరుగులు తీశారు.

ఈ ఘటనలో ఫాస్ట్‌ఫుడ్ యజమాని సహా ఆరుగురు గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు. పలువురు శరీరం కాలినట్టు తెలుస్తోంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే దాదాపు 8 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.


ALSO READ: అక్కే వ్యభిచార రొంపిలోకి దింపింది.. చెన్నైలో వెలుగుచూసిన ఘటన

అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మరోవైపు రెస్టారెంట్లలో అవసరమైన దానికంటే ఎక్కువగా గ్యాస్ సిలిండర్లను స్టోరేజ్ చేయడమే ఈ ఘటన తీవ్రతకు కారణంగా తెలుస్తోంది. మరి పోలీసులు విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×