Manmohan Singh Hospitalized: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్ను మూశారు. ఢిల్లీలోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్ సింగ్‌ను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎయిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. వెంటనే ఆయన్ని ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందించారు. కానీ, బతికించలేకపోయారు.
మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఆయన ఆరోగ్య స్థితిగతులను కుటుంబ సభ్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆయన కన్ను మూసినట్లు తెలిసి సంతాపం వ్యక్తం చేశారు. మన్మోహన్ మరణ వార్త తెలిసి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎయిమ్స్ హాస్పిటల్‌కు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన భౌతిక కాయం అక్కడే ఉంది. శుక్రవారం ఉదయం ఆయన నివాసానికి చేర్చే అవకాశాలున్నాయి.
మన్మోహన్ సింగ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం బాగా క్షిణించింది. శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎయిమ్స్ వైద్యశాలకు తరలించారు. 92 ఏళ్ల వయసుగల మన్మోహన్ సింగ్ నూతన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో మంచి ఆర్థికవేత్తగా తనకంటూ గుర్తింపు పొందారు. అలాగే దేశానికి 15వ ప్రధానిగా మన్మోహన్ సింగ్ మంచి సుపరిపాలన అందించి తనదైన మార్క్ పాలనాపరంగా చాటిచెప్పారు. మన్మోహన్ మరణ వార్త తెలిసి.. రాజకీయవేత్తలు, ప్రముఖులు నివాళ్లు అర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. గొప్ప నాయకుడిని, ఆర్థిక వేత్తను కోల్పోయామంటూ.. మన్మోహన్ మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.