Big Stories

Sri Rama Navami: శ్రీరామనవమి రోజు ఇలా చేస్తే కష్టాలు తప్పవు..

 

- Advertisement -

Sri Rama Navami: మరికొన్ని గంటల్లో దేశ వ్యాప్తంగా శ్రీరామనవమికి వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. రాముల వారి జన్మదినం, కళ్యాణం కోసం దేశ ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిత్ 17 బుధవారం వచ్చిన శ్రీరామనవమికి చాలా ప్రత్యేకలు కూడా ఉన్నాయి. రాముల వారు జన్మించిన ఈ రోజున ఈ ఏడాది అరుదైన యోగం కూడా ఉందట. అందువల్ల భక్తులకు రాముల వారు భోగబాగ్యాలు, సిరిసంపదలను ఇవ్వనున్నట్లు పండితులు చెబుతున్నారు. అయితే రామనవమి నాడు కొన్ని నియమాలను తప్పక పాటించాలని, కొన్ని పనులను అస్సలు చేయకూడదని అంటున్నారు. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

- Advertisement -

పాటించాల్సిన నియమాలు..

శ్రీరామనవమి నాడు సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి స్నానాలు ఆచరించి ఇంటికి మామిడి, పూల తోరణాలు కట్టాలి. శ్రీరాముడి దర్శనానికి ముందు సూర్యుడి దర్శనం చేసుకోవాలి. సూర్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యదేవుడికి పూజించిన అనంతరం తులసి దేవికి పూజలు చేయాలి. ఇక అనంతరం పూజ గదిలో పూజలు ప్రారంభించాలి.

రాముడు, సీత, లక్ష్మణుడు ఉన్న ఫోటోను తీసుకుని రేపు అభిషేకం నిర్వహించాలి. రాముల వారికి ఇష్టమైన నైవేద్యాలు చేసి పెట్టాలి. వడపప్పు, పానకం చేసి రాముల వారికి సమర్పించాలి. అనంతరం భక్తి శ్రద్ధలతో రాముల వారి పాటలను, పద్యాలను ఆలపిస్తూ పూజలు చేయాలి. అనంతరం రామకోటి, రామాయణం, రామస్మరణం వంటివి చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది. రాముల వారి కళ్యాణం సందర్భంగా ఉపవాసం ఉండాలనుకునే వారు కొబ్బరి నీళ్లు, జ్యూస్, నిమ్మరసం వంటివి తీసుకోవాలి.

Also Read: రామనవమి రోజున గజకేసరి యోగం.. ఊహించని సంపద, శక్తి.. పూజ ఎలా చేయాలో తెలుసా?

చేయకూడనివి..

రాముల వారి జన్మదినం, కళ్యాణం సందర్భంగా రేపు కొన్ని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. మాంసాహారం, మద్యం వంటివి సేవించకూడదు. ముఖ్యంగా జుట్టును కత్తిరించుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు. అబద్ధాలు ఆడడం, గొడవలు, కొట్లాటలు వంటి వాటికి దూరంగా ఉండాలి. రేపు రాముల వారికి ప్రసాదంగా చేసే వంటల్లో అల్లం, వెల్లుల్లిని వాడకూడదు. ఉపవాసం ఉండేవారు భక్తి శ్రద్ధలతో మనసారా రాముల వారిని పూజించాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News