E-Paper
Advertisement

ఎనర్జీ డ్రింక్ లేబుళ్లపై FSSAI నిషేధం.. కంపెనీలకు 90 రోజుల గడువు, దీని వెనుక ఏం జరిగింది?

ఎనర్జీ డ్రింక్ లేబుళ్లపై FSSAI నిషేధం.. కంపెనీలకు 90 రోజుల గడువు, దీని వెనుక ఏం జరిగింది?
Advertisement

FSSAI Ban: రకరకాల మోసపూరిత ప్రకటనలతో వినియోగదారులను ఆకట్టుకున్నాయి ఎనర్జీ డ్రింక్స్‌. వాటిపై ఉక్కుపాదం మోపింది FSSAI.
అధిక కెఫిన్ కారణంగా వాటిని ఎనర్జీ డ్రింక్స్‌గా ప్రచారం చేయవద్దని తేల్చి చెప్పేసింది. మూడు నెలల్లోపు వాటిపై ఎనర్జీ లేబుళ్లు తొలగించాలని స్పష్టం చేసింది.

దేశంలో విస్తరిస్తున్న ఎనర్జీ డ్రింక్స్ మార్కెట్-భారతదేశంలో ఎనర్జీ డ్రింక్స్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందింది. చాలా కంపెనీలు భారత్ మార్కెట్‌పై కన్నేశాయి. జనాల పిచ్చి చాలా కంపెనీలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. ఫలితంగా రకరకాల పేర్లతో ఎనర్జీ డ్రింక్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి.. వస్తున్నాయి కూడా. అందుబాటు ధరలో లభించే ఈ పానీయం.. యువతీయువతులను ఆకట్టుకుంటున్నాయి, చివరకు ప్రజాదరణ పొందాయి కూడా. వాటిలో చాలా ఎనర్జీ అనబడే డ్రింక్స్ ఉన్నాయి. 2018-23 మధ్య ఆయా డ్రింక్స్ అమ్మకాలు ప్రతీ ఏటా రెట్టింపు అయ్యింది. యూరోమానిటర్ అంచనాల ప్రకారం.. 2028 నాటికి భారత ఎనర్జీ డ్రింక్స్ మార్కెట్ విలువ 1.6 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఓ అంచనా.

Advertisement

ఎనర్జీ డ్రింక్ లేబుళ్లపై FSSAI నిషేధం- తాజాగా భారత్‌లో ఎనర్జీ డ్రింక్స్ పేరుతో విక్రయిస్తున్న ఉత్పత్తులకు ఎలాంటి అధికారిక ప్రమాణాలు లేవని తేల్చేసింది ఇండియా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్‌‌ అథారిటీ ఆఫ్ ఇండియా-ఎఫ్ఎస్ఎస్ఏఐ-FSSAI. పెప్సీ, రెడ్ బుల్, మాన్‌స్టర్ బెవరేజ్, రిలయన్స్, హెల్ ఎనర్జీ వంటి బ్రాండ్‌ల అభ్యంతరాలు చేశాయి. అవేమీ పట్టించుకోకుండా FSSAI ప్రకటన చేసింది. శరీరానికి- మనస్సుకు ఉత్తేజం ఇస్తుందని, సాధారణ బలహీనతలో సహాయపడుతుందని మాటల వాదనలు వినియోగదారులను తప్పు దోవ పట్టించడమేనని పేర్కొంది.

కంపెనీలకు 90 రోజుల గడువు-అధిక కెఫిన్ ఉన్న పానీయాల లేబుళ్లపై ఎనర్జీ డ్రింక్ అనే పదాన్ని ఉపయోగించడాన్ని నిలిపి వేయాలని భారతదేశ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ ఎఫ్‌‌ఎస్‌‌ఎస్‌‌ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రజిత్ పున్హానీ వెల్లడించారు. ఆయా లేబుళ్లు మార్చడానికి 90 రోజులు దాదాపు మూడు నెలలు గడువు సదరు కంపెనీలకు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో అసంతృప్తిగా ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించ వచ్చని స్పష్టం చేసింది.

Advertisement

ALSO READ: బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్టులో ఉద్యోగాలు.. నెలకు లక్ష పైమాటే, ఐటీఐ పాసైతే చాలు

అప్పుడే రాజస్థాన్‌లో మార్పు-ఇటీవల పరిశ్రమ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈఓ రజిత్ పున్హానీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన విషయం తెల్సిందే. జూలై 6న FSSAIకి పంపిన లేఖలో అలాంటి నోటీసులను బహిరంగం చేయడం వల్ల కంపెనీల ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. దీనివల్ల వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందని, వినియోగదారులు గందరగోళానికి గురి కావచ్చని ఆ సంఘం పేర్కొంది. నిబంధనలలో మార్పులు చేసే ముందు పరిశ్రమతో తప్పకుండా చర్చలు జరపాలని అందులో కోరిన విషయం తెల్సిందే. ఇదిలా ఉండగా రాజస్థాన్‌లో ఈ తరహా చర్య మొదలైంది. ఈ చర్యలో భాగంగా స్టింగ్, క్యాంపా, రెడ్ బుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

Related News

జైల్లోనూ మారని బుద్ధి.. ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌లో పదుల సంఖ్యలో పో*ర్న్ వీడియోలు!

15 సార్లు అమెజాన్ ఇంటర్‌వ్యూలో ఫెయిల్.. చివరకు అదే కంపెనీలో రూ.కోట్ల జీతానికి జాబ్..

జిన్ పింగ్ రాకకు ముందు.. చైనా రాయబారి ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే?

UPSCలో జాబ్స్.. కేంద్ర ప్రభుత్వంలో 212 ఉద్యోగ ఖాళీలు.. వెంటనే అప్లై చేయండి

ఆత్మీయ కౌగిలి.. తిరుక్కురళ్ కానుక.. భారత్ – రష్యా బంధంలో మరో కీలక ఘట్టం!

5G సిగ్నల్ సరిగ్గా రాలేదని.. జియో ఎంప్లాయ్‌ని టవర్‌కే కట్టేశారు!

దేశంలో ఘోరం.. భార్య, ముగ్గురు కూతుళ్లను.. రాయితో కొట్టిచంపిన కిరాతకుడు!

వాహనదారులకు గుడ్‌న్యూస్.. టోల్‌ ప్లాజాల వద్ద ఆగకుండానే నేరుగా, ఫిబ్రవరి నుంచే అమల్లోకి!

Big Stories

Advertisement
×