E-Paper
Advertisement

బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్టులో ఉద్యోగాలు.. నెలకు లక్ష పైమాటే, ఐటీఐ పాసైతే చాలు

బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్టులో ఉద్యోగాలు.. నెలకు లక్ష పైమాటే, ఐటీఐ పాసైతే చాలు
Advertisement

Bullet Train Job Recruitment: దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది దీన్ని ప్రారంభించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్- NHSRCL. వివిధ విభాగాల పోస్టులకు ఐటీఐ పాసైతే చాలు.. జీతం లక్ష పైమాటే. ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేయండి.

బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్టులో ఉద్యోగాలు- దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం సాంకేతిక విభాగాలలో 237 టెక్నీషియన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్-NHSRCL. అర్హులైన అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. అధికారిక NHSRCL వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Advertisement

నెలకు జీతం లక్ష పైమాటే-దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 5 వరకు ఉంది. ఈ నియామక ప్రక్రియ సివిల్, ఎలక్ట్రికల్, సిగ్నలింగ్,  టెలికాం, రోలింగ్ స్టాక్ వంటి పలు విభాగాలలో అవకాశాలను అందిస్తుంది.ఎంపికైన అభ్యర్థులను ముంబై–అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ లేదా ఇతర NHSRCL యూనిట్ల కింద నియమిస్తారు.

ఐటీఐ లేదా డిప్లొమా పాసైతే చాలు- అందులో ఎలక్ట్రికల్, సిగ్నలింగ్-టెలికాం, సివిల్-ట్రాక్ ఫిట్టర్, మెకానిక్, ఫిట్టర్, వెల్డర్ వంటి విభాగాలు ఉన్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష-CBT ద్వారా పత్రాల ధృవీకరణ జరగనుంది. ఎంపికైన వారికి నెలకు రూ.35,000 నుంచి రూ.1.10 లక్షల వరకు జీతం అందనుంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పూర్తి చేయాలి.

Advertisement

అర్హతలు ఇవే-టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు  ITI, సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్‌తో కూడిన మెట్రిక్యులేషన్, సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో మూడేళ్ల డిప్లొమా ఉండాలి. దరఖాస్తుదారులు రైల్వేలు, మెట్రో రైలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని రైల్వే వ్యవస్థలు లేదా రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్-RRTS ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి.

అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లు. అర్హతలు కలిగిన వారు ఆగస్ట్ 5 లోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు రుసుము  రూ.400 చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రుసుము మినహాయింపు. ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటాయి.

ALSO READ: నిక్కర్‌లో మూత్రం.. ప్రైవేటు పార్టుపై టీచర్ వాతలు, వారణాసిలో షాకింగ్ ఘటన

తొలుత కంప్యూటర్ ఆధారిత పరీక్ష-CBT ఉంటుంది. ఆ తర్వాత పత్రాలు ధృవీకరణ, చివరగా  వైద్య పరీక్షలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు ఏడాదిపాటు ప్రొబేషన్ ఉంటుంది. దరఖాస్తుదారులు ప్రకటనను జాగ్రత్తగా చదవి, తమ అర్హతను సరి చూసుకోవాలని సూచన చేసింది.

Related News

ఆత్మీయ కౌగిలి.. తిరుక్కురళ్ కానుక.. భారత్ – రష్యా బంధంలో మరో కీలక ఘట్టం!

5G సిగ్నల్ సరిగ్గా రాలేదని.. జియో ఎంప్లాయ్‌ని టవర్‌కే కట్టేశారు!

దేశంలో ఘోరం.. భార్య, ముగ్గురు కూతుళ్లను.. రాయితో కొట్టిచంపిన కిరాతకుడు!

వాహనదారులకు గుడ్‌న్యూస్.. టోల్‌ ప్లాజాల వద్ద ఆగకుండానే నేరుగా, ఫిబ్రవరి నుంచే అమల్లోకి!

‘చిన్నారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం’.. ఇన్‌ఫ్లుయెన్సర్ వేధింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఉత్కంఠకు చెక్.. భారత్‌లో చైనా అధ్యక్షుడి పర్యటన ఖరారు.. బ్రిక్స్ సదస్సుకు హాజరు

గుజరాత్ ఒమ్ని vs ఇటలీ బార్.. 80s ఏఐ ట్రెండ్‌తో.. రచ్చకెక్కిన బీజేపీ, కాంగ్రెస్!

సీఎం విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అవును విజయ్.. నా దవడ విరిగింది?

Big Stories

Advertisement
×