E-Paper
Advertisement

రూ.1,299 కే టైప్-సి ఛార్జింగ్, ఫంక్షనల్ క్రౌన్ స్మార్ట్‌వాచ్.. ఫీచర్స్ అదిరాయిగా!

రూ.1,299 కే టైప్-సి ఛార్జింగ్, ఫంక్షనల్ క్రౌన్ స్మార్ట్‌వాచ్.. ఫీచర్స్ అదిరాయిగా!
Advertisement

boAt Storm Call 4: తక్కువ బడ్జెట్‌లో.. సూపర్ స్మార్ట్‌వాచ్ కొందామని ప్లాన్ చేస్తున్నారా? బడ్జెట్ తక్కువగా ఉందని ఫీచర్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ప్రముఖ బ్రాండ్ బోట్ మార్కెట్లోకి ఒక మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌వాచ్‌ను తీసుకొచ్చింది. అదే boAt Storm Call 4. కేవలం రూ. 1,299 ధరకే లభించే ఈ వాచ్‌లో టైప్-సి ఛార్జింగ్, ఫంక్షనల్ క్రౌన్ లాంటి ఎన్నో క్రేజీ ఫీచర్స్ ఉన్నాయి.

boAt Storm Call 4 పూర్తి ఫీచర్లు:

1. పెద్ద HD డిస్‌ప్లే & స్టైలిష్ డిజైన్:

ఈ వాచ్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, ప్రీమియం లుక్‌తో ఉంటుంది. ఇందులో.. ఉన్న పెద్ద హెచ్‌డీ డిస్‌ప్లే వల్ల నోటిఫికేషన్లు, మెసేజ్‌లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. బ్రైట్‌నెస్ కూడా బాగుండటం వల్ల ఎండలో.. బయట తిరుగుతున్నప్పుడు కూడా స్క్రీన్‌ను ఈజీగా చూడొచ్చు. స్క్వేర్ డయల్ డిజైన్‌తో.. వచ్చే ఈ వాచ్ చేతికి పెట్టుకుంటే క్లాసీ లుక్ వస్తుంది.

2. టైప్-సి ఛార్జింగ్ (Type-C Charging):

Advertisement

చాలా వరకు బడ్జెట్ స్మార్ట్‌ వాచ్‌లకు ప్రత్యేకమైన మాగ్నెటిక్ ఛార్జర్లు ఇస్తుంటారు. అవి పోతే.. మళ్లీ కొనడం పెద్ద తలనొప్పి. కానీ.. బోట్ ఈసారి కస్టమర్ల పల్స్ పట్టుకుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. అంటే.. మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఛార్జర్‌తోనే.. ఈ వాచ్‌ను కూడా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎక్స్‌ట్రా కేబుల్స్ మోసే తిప్పలు తప్పుతాయి.

3. రియల్ ఫంక్షనల్ క్రౌన్ :

ఈ ధరలో చాలా కంపెనీలు వాచ్ సైడ్‌న నార్మల్ బటన్ ఇస్తాయి. కానీ boAt Storm Call 4 లో వర్కింగ్ ‘ఫంక్షనల్ క్రౌన్’ ఇచ్చారు. దీన్ని రొటేట్ (తిప్పడం).. చేయడం ద్వారా మీరు వాచ్ మెనూను స్క్రోల్ చేయవచ్చు. హోమ్ స్క్రీన్ వాల్‌పేపర్స్ మార్చుకోవచ్చు. ఇది వాచ్ ఆపరేటింగ్‌ను చాలా స్మూత్‌గా మారుస్తుంది.

4. అడ్వాన్స్‌డ్ బ్లూటూత్ కాలింగ్ :

Advertisement

ఫోన్ పక్కన పడేసి వాచ్ నుంచే డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు. ఇందులో ఉన్న ఇన్-బిల్ట్ మైక్, స్పీకర్ క్వాలిటీ చాలా బాగున్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ స్ట్రాంగ్‌గా ఉండటం వల్ల కాల్స్ అస్సలు డిస్‌కనెక్ట్ అవ్వవు. బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా జిమ్‌లో వర్కవుట్.. చేస్తున్నప్పుడు ఈ ఫీచర్ బాగా యూజ్ అవుతుంది.

5. హెల్త్ అండ్ స్పోర్ట్స్ మోడ్స్:

రూ. 1,299 కే హెల్త్ ఫీచర్స్ కూడా లోడ్ చేసి ఇచ్చారు.

Heart Rate & SpO2 Monitoring: మీ గుండె వేగం, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ట్రాక్ చేస్తుంది.

Sleep Tracker: మీ నిద్ర నాణ్యతను అంచనా వేస్తుంది.

Fitness Modes: రన్నింగ్, వాకింగ్ లాంటి మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్ ఇందులో ఉన్నాయి.

ఈ వాచ్ ఎవరికి బెస్ట్?

రూ. 1,299 ధర అనేది చాలా చాలా తక్కువ (ఒక నార్మల్ వాచ్ ధరకే స్మార్ట్‌వాచ్ వస్తోంది).

యూనివర్సల్ టైప్-సి ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్.

బ్లూటూత్ కాలింగ్ , రొటేటింగ్ క్రౌన్ పర్ఫెక్ట్‌గా పనిచేస్తాయి.

Also Read: మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం.. రూ.5,299కే ఇన్వర్టర్, ఇంత తక్కువ ధరకు మళ్ళీ దొరకదు!

ఏం గమనించాలి? :

ఇది అమోలెడ్ స్క్రీన్ కాదు.. నార్మల్ HD డిస్‌ప్లే మాత్రమే.. (కానీ ఈ ధరకి HD స్క్రీన్ ఇవ్వడమే ఎక్కువ).

హెల్త్ ట్రాకింగ్ డేటా 100% మెడికల్ గ్రేడ్ అంత పక్కాగా ఉండకపోవచ్చు (బడ్జెట్ వాచీలన్నింటికీ ఇది వర్తిస్తుంది).

మీరు స్టూడెంట్ అయినా లేదా తక్కువ బడ్జెట్‌లో గిఫ్ట్ ఇవ్వడానికి ఒక మంచి బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నా.. boAt Storm Call 4 ఒక అద్భుతమైన ఆప్షన్. టైప్-సి ఛార్జింగ్ , ఫంక్షనల్ క్రౌన్ లాంటి ఫీచర్లు ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో దీనిని ‘కింగ్’ అనిపించేలా చేస్తున్నాయి. స్టాక్ అయిపోయేలోపే.. అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి.

Related News

రూ.15వేల లోపు ది బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు.. ఆఫర్లు చూస్తే షాక్ అవుతారు!

రెడ్‌మి, షియోమి ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఏ మోడల్ ధర ఎంత తగ్గిందంటే?

బోట్ నుంచి కొత్త అల్టిమా ప్రైమ్ స్మార్ట్‌వాచ్.. ఫీచర్లకు మైండ్ బ్లాక్

రూ. 2000లోపు.. బెస్ట్ ఇయర్‌బడ్స్ కావాలా ? ఈ ఆఫర్లు మిస్సవ్వొద్దు

ఈ-సిమ్‌తో ఇంటర్నెట్ స్పీడు పెరుగుతుందా? బెస్ట్ నెట్ వర్క్‌కు ఏ సిమ్ బెస్ట్?

జియో vs ఎయిర్‌టెల్.. 84 రోజుల వ్యాలిడిటీ, ఫ్రీ కాల్స్.. ఏ ప్లాన్ బెస్ట్ అంటే?

ఒడిలోని ల్యాప్‌టాప్.. జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×