E-Paper
Advertisement

Lok Sabha Elections 2024: ఆసక్తికరంగా అనంత్‌నాగ్.. గులాం నబీ ఆజాద్‌పై మెహబూబా ముఫ్తీ పోటీ..

Lok Sabha Elections 2024: ఆసక్తికరంగా అనంత్‌నాగ్.. గులాం నబీ ఆజాద్‌పై మెహబూబా ముఫ్తీ పోటీ..
PDP Chief Mehbooba Mufti To Contest From Anantnag faces Ghulam Nabi Azad
PDP Chief Mehbooba Mufti To Contest From Anantnag faces Ghulam Nabi Azad

PDP Chief Mehbooba Mufti To Contest From Anantnag faces Ghulam Nabi Azad: పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ లోక్‌సభ ఎన్నికల్లో అనంత్‌నాగ్-రాజౌరీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కాగా ఈ స్థానం నుంచే మాజీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌తో పోటీ చేయనున్నారు. దీంతో అనంత్‌నాగ్ ఆసక్తికరంగా మారింది.

శ్రీనగర్ నుంచి వహీద్ పారా, బారాముల్లా నియోజకవర్గం నుంచి ఫయాజ్ మీర్‌ను పీడీపీ ప్రకటించింది. జమ్మూ ప్రాంతంలోని రెండు స్థానాలైన ఉదంపూర్, జమ్మూలో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని పీడీపీ ప్రకటించింది.

కాశ్మీర్ లోయలోని మూడు స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పిన కొన్ని రోజులకే.. మూడు స్థానాలకు పీడీపీ అభ్యర్థులను ప్రకటించింది.

కాగా 2004, 2014 ఎన్నికల్లో పీడీపీ చీఫ్ అనంత్‌నాగ్ నుంచి గెలుపొందారు.

డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) అధినేత గులాం నబీ ఆజాద్‌పై ముఫ్తీ పోటీ చేయనున్నారు. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం కోసం తాను ఎన్నికల్లో పోరాడుతున్నానని మాజీ కాంగ్రెస్ నాయకుడు చెప్పారు.

Also Read: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారిన నిరుద్యోగం.. కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే

“అత్యంత పెద్ద సమస్య ఏమిటంటే మనకు రాష్ట్ర హోదా లేకుండా పోయింది. మనది కేంద్రపాలిత ప్రాంతం. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు నేను రాజ్యసభలో పోరాడాను. రాష్ట్ర హోదా కోసం నేను లోక్‌సభలో కూడా పోరాడాలనుకుంటున్నాను.. గవర్నర్‌తో కూడిన పూర్తి రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తాం.. లోక్‌సభలో నా మొదటి పోరాటం రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసమే” అని ఆయన చెప్పారు.

అనంత్‌నాగ్-రాజౌరీ స్థానానికి మే 7న మూడో దశలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×