E-Paper
Advertisement

BJP candidate Assets: నా ఆస్తులు రూ.1400 కోట్లు, దుబాయ్, లండన్‌..!

BJP candidate Assets: నా ఆస్తులు రూ.1400 కోట్లు, దుబాయ్, లండన్‌..!
Advertisement

BJP candidate Assets: సార్వత్రిక ఎన్నికల వేళ ఒక్కో విడత నోటిఫికేషన్ విడుదల చేస్తోంది ఎన్నికల సంఘం. కొన్నిచోట్ల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. తాజాగా డబ్బున్నవాళ్లు ఈసారి ఎన్నికల బరిలో ఎక్కువగానే ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. వారిలో ఒకరు గోవా బీజేపీ అభ్యర్థి పల్లవి డింపో. ఈమె ఆస్తుల ఎంతో తెలుసా? అక్షరాలా 1400 వందల కోట్ల రూపాయలు. విచిత్రంగా ఉంది కదూ. ఇంకా లోతుల్లోకి వెళ్తే…

దక్షిణ గోవా నుంచి బీజేపీ అభ్యర్థిగా పల్లవి డింపో మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకి సంబంధించిన ఆస్తుల చిట్టాను వెల్లడించారు. మొత్తం 119 పేజీల అఫిడవిట్‌లో దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న ఆస్తుల గురించి తెలిపారు. ఓవరాల్‌గా ఆస్తుల విలువ 1400 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. పల్లవి పేరిట 255 కోట్ల రూపాయల విలువైన చరాస్తులు ఉన్నాయి. ఆమె భర్త శ్రీనివాస్ పేరిట ఆస్తుల విలువ అక్షరాలా 994 కోట్లు. ఇక పల్లవి స్థిరాస్తుల విలువ ప్రస్తుతానికి 28 కోట్లు కాగా, ఆమె భర్తకు 83 కోట్ల రూపాయలు ఉన్నట్లు ప్రస్తావించారు.

Goa bjp candidate pallavi dempo
Goa bjp candidate pallavi dempo
Advertisement

గోవాలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను కూడా వెల్లడించారామో. దుబాయ్‌లో పల్లవి దంపతులకు అపార్ట్‌మెంటు ఉంది. దీని విలువ రెండున్నర కోట్ల రూపాయలు. లండన్‌లో ఉన్న అపార్ట్‌మెంటు దాదాపు 10 కోట్ల రూపాయలు. లగ్జరీ కార్లు చాలానే ఉన్నాయి. అంతేకాదు బంగారు ఆభరణాల విలువ అక్షరాల ఐదున్నర కోట్ల పైమాటే. గతేడాది ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసినవి 10 కోట్లు పల్లవి వంతు కాగా, ఆమె భర్త శ్రీనివాస్ 11 కోట్ల రూపాయలు.

ALSO READ: మోదీ సర్కార్ అతి పెద్ద అవినీతి

Advertisement

ఈమె పూణెలోని బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు చేశారు. పల్లవి.. శ్రీనివాస్‌ను మ్యారేజ్ చేసుకున్నారు. ఆయన డింపో గ్రూపులకు ఛైర్మన్. ఆ గ్రూపులో ఫుట్‌బాల్, రియల్ ఎస్టేట్, షిప్ బిల్డింగులు, ఎడ్యుకేషన్, మైనింగ్ వంటి విభాగాలున్నాయి.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×