BigTV English

Rakul Preeth Singh: పెళ్లి తరువాత రకుల్ కొత్త ‘ఆరంభం’..

Rakul Preeth Singh: పెళ్లి తరువాత రకుల్ కొత్త ‘ఆరంభం’..

Rakul Preeth Singh: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. ఇది పెద్దలు చెప్పిన సామెత. దీన్ని సినిమా ఇండస్ట్రీకి అన్వయిస్తే.. అవకాశాలు ఉన్నప్పుడే.. అందం ఉన్నప్పుడే.. నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. లేకపోతే చివరికి చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి వస్తుంది. ఈ విషయం ఒకప్పుడు స్టార్ హీరోయిన్లకు తెలియలేదు. కానీ, ఇప్పుడున్న హీరోయిన్లు అలా కాదు.. మొదటి సినిమా హిట్ అవ్వడం ఆలస్యం ఆ డబ్బుతో వేరే బిజినెస్ లలో పెట్టుబడులు పెడుతూ ఎదిగిపోతున్నారు.


ఇప్పుడు ఇదంతా ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే.. ఇంకెవరు మన హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి.. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ చిన్నది.. మొదటి నుంచి బిజినెస్ లు చేయడం మొదలుపెట్టింది. హైదరాబాద్, ముంబై ఏరియాల్లో ఈ ముద్దుగుమ్మ ఫిట్ నెస్ జిమ్ లను ఓపెన్ చేసి గట్టిగానే సంపాదిస్తుంది. ఇక ఈ ఏడాది రకుల్.. నిర్మాత జాకీ భగ్నానీని వివాహమాడి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇక పెళ్లి తరువాత సినిమాల్లో నటించడం గురించి పక్కన పెడితే.. అమ్మడు కొత్త వ్యాపారానికి నాంది పలికింది. సెలబ్రిటీల ఫుడ్ రెస్టారెంట్స్ ఎంత గుర్తింపు తెచ్చుకున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .

తాజగా రకుల్ సైతం ఫుడ్ బిజినెస్ లోకి దిగింది. ఆరంభం అనే పేరుతో ఆమె హైదరాబాద్ లో ఒక రెస్టారెంట్ ను ఓపెన్ చేసింది. ఇక ఇది మిల్లెట్ రెస్టారెంట్ కావడం విశేషం. రకుల్ ఫిట్ నెస్ ఫ్రీక్ కావడంతో ప్రజలకు మంచి హెల్తీ ఫుడ్ ను అందిస్తుంది. నేడు ఈ రెస్టారెంట్ రకుల్ తన చేతుల మీదనే ఓపెన్ చేసింది.ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ బిజినెస్ లో అమ్మడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×