BigTV English

Komatireddy Venkat Reddy: దమ్ముంటే టచ్ చెయ్.. కేసీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి మాస్ వార్నింగ్..

Komatireddy Venkat Reddy: దమ్ముంటే టచ్ చెయ్.. కేసీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి మాస్ వార్నింగ్..

Komatireddy Venkat Reddy Warns EX CM KCR: లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ మార్పులుంటాయని.. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీని టచ్ చేసి చూడు అని సవాల్ విసిరారు. నల్గొండలో ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ఆయన మాజీ సీఎంపై విరుచుకుపడ్డారు.


ప్రజాస్వామ్యంలో ఇలాంటి మాటలు సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తమ టార్గెట్ 15 సీట్లు అని మంత్రి తెలిపారు. నల్గొండను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని.. నిండా ముంచారని పేర్కొన్నారు. ఏఎమ్ఆర్పీ ప్రాజెక్ట్ లైనింగ్ పూర్తి చేయకుండా, ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పూర్తి చేయకుండా నల్గొండను ఎడారిగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

Komatireddy Venkat Reddy
Komatireddy Venkat Reddy

ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి కనీసం అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలోకి బీఆర్ఎస్ నేతలు వెళ్లి టికెట్ తెచ్చుకుంటున్నారని.. బీఆర్ఎస్‌ బీ ఫామ్‌తో పోటీ చేయడానికి భయపడుతున్నారని అన్నారు. అసలు ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వచ్చారని ప్రశ్నించారు.


Also Read: కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు

కవిత లిక్కర్ స్కామ్‌లో జైలుకి వెళ్లడంతో తండ్రీ, కొడుకులకు మతి తప్పిందని మంత్రి స్పష్టం చేశారు. ప్రభాకర్ రావు నుంచి తారకరామారావు వరకు జైలుకి వెళ్తారని.. చర్లపల్లి, చంచల్‌గూడ జైలులో అందరికీ డబుల్ బెడ్ రూమ్‌లు కట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. మూడు నెలల్లో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుందని జోస్యం చెప్పారు. తాము అనుకుంటే బీఆర్ఎస్‌లో 9 మంది కూడా మిగలరని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయయ్యారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×